అని శేషజీవితం ఎలా గడపాలో ఉపదేశించి అలా గడిపితే అవసానంలో తన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చి సాగనంపుతాడు. అలాగే తన జీవిత శేషం బదరికాశ్రమంలో చరితార్థం చేసుకొని ఆ పరమ భాగవతుడు
యథో పదిష్టాం జగదేక బంధునా- తపస్సమాస్థాయ హరేరగాద్గతిమ్
ఇదీ ఉద్దవుడి భాగవత చరిత్ర. ఉద్దవుడి చరిత్ర హరివంశంలో లేదు. అక్రూరుడి వృత్తాంతముంది గాని అతని దౌత్య వ్యవహారం కానరాదు.
మొత్తం మీద కుంతి దగ్గరి నుంచీ ఉద్దవునిదాకా సగుణభక్తి అనేది ఏమిటో ఎలాంటిదో ఏ కరువు పెడుతూ వచ్చాము ఇందులో ఎన్నో భూమికలూ ఎంతో వ్యవహారముంది. అది కూడా ఆయా వ్యక్తుల చిత్త వృత్తులనూ భక్తిలో వారికుండే మందమధ్య తీవ్ర తీవ్రతరాది వేగాలనూ బట్టి నానావిధాలుగా మనకు దర్శనమిస్తుంది. అయితే ఎంత తీవ్రాతి తీవ్రమైనా ఇది సగుణమే ననే మాట మనం మరచిపోరాదు. కడకు అక్రూరోద్దవులది కూడా సగుణమే. పరమాత్మ వారికెంత సన్నిహితుడైనా కావచ్చు. ఎన్ని శాస్త్ర రహస్యాలైనా బోధించి ఉండవచ్చు. సంసార తారణమే వాటన్నిటికీ ప్రయోజనమే కావచ్చు. అయినా అది సగుణసీమ దాటిపోదు. కృష్ణ సందర్శనమే వారి ధ్యేయం. ఆయనతో సహా శయ్యా సనాది సుఖమే వారు కోరుకొనేది. ఆయన తోడి క్షణకాల విరహంకూడా వారికి సహస్ర యుగోపమం. గోపికలే కారు ఉద్ధవాదులే కారు. అందరికీ అదే పిచ్చి. అది భక్తిలో ఒక భూమికేగాని భక్తి సర్వస్వం కాదని తెలుసు పరమాత్మకు. అందుకే వారితో ఉన్నట్టే ఉండి అదృశ్యమవుతాడు. వారి నాదరించినట్టే ఆదరించి ఒకమందస్మితం చేసివారిని మరలా మాయలో పడదోస్తాడు. ఈ మందహాసమే మహామోసం. నవ్వు రాజిల్లెడు మోమువాడన్నట్టు ఇది ఒక అంతుపట్టని గుణం. ఈ గుణజాలమొక ఇంద్రజాలం మాదిరందరి మీదా ప్రయోగించి వారి మనో విహంగమాల నాజాలంలో బందీ చేయటంలో అందె వేసిన చేయి ఆయనది. ఇది తెలుసుకోలేక వారాయన మనవాడే గదా అని ఏమోమో కోరుతారు. ఇస్తాడని ఆశపడతారు. ఇవ్వడూ. చేయడు. ఇచ్చినట్టు కనిపిస్తాడంతే. కనుకనే గోపికలను కలుసుకొంటానని చెప్పి మరలా కన్నెత్తి చూడలేదు. అక్రూరుని వీడ్కొలిపి మరలా ఆలోచించలేదాతని సంగతి. ఒక్క ఉద్దవునికే ఏదో చెప్పినట్టు కనిపిస్తాడు. అది కూడా సగుణభావన ఉన్నంతవరకూ పనిచేయదు. అపేక్షితమైన
Page 292