పెడతారు. ఇదంతా ఉపాలంభం కాదు. కేవలమూ కృష్ణ విప్రలంభ జనిత తృష్ణాతిరేక ప్రేమాతిశయ విజృంభమే. అర్థమయింది ఉద్దవుడికి-అనురాగం శ్రుతి మించితే భక్తుడి మనస్తత్త్వమలాగే ఉంటుందని. ఆ వాలు గంటుల భక్తిముందు తన భక్తి కూడా చాలదని భావించాడు.
జపదాన వ్రతహోమ సంయమ తపః స్వాధ్యాయ ముఖ్యంబులన్ నిపుణుల్ గోరియునే విభున్ మనములో నిల్పంగలే – రట్టి స ద్విపులా కారునిపై మహా మహిము పై విశ్వేశుపై మీ కజ స్ర పటు ధ్యానము లిట్లు నిల్చునె భవ చ్చారిత్రముల్ చిత్రముల్
అని వారినెంతగానో కీర్తిస్తాడు. నిపుణులనే మాటలో ఎంతైనా అర్థముంది. పండితులకు పాండిత్య గర్వ విక్షేపాదు లడ్డు తగులుతాయి భక్తి మార్గంలో. అందుకే వారికంత గట్టిగా నిలవదది. పామరులకలాటి విక్షేపాదులుండవు కాబట్టి గట్టిగా నిలుస్తుందని భావం. కృష్ణమూర్తి తప్పక మిమ్ము అచిరకాలంలోనే కలుసుకొంటాడు. మిమ్ము తలకవలదని నాచేత చెప్పి పంపాడని చెప్పి వారి ననునయిస్తాడు. వారి మధురభక్తి జనిత విధుర వచనాల నాలకిస్తూ కొన్ని మాసాలా ప్రజపురంలో గడపి తరువాత ప్రవ్రజితుడై మధురకే పయనమై వస్తాడు. కృష్ణుడికి వారి ప్రతిసందేశం వినిపిస్తాడు.
అక్రూరుడిలాగానే ఉద్ధవుడు కూడా యాదవకుల శ్రేష్ఠుడూ, విద్యా వరిష్ఠుడూ గుణ గణజ్యేష్ఠుడే సందేహం లేదు. ఇరువురూ భగవద్భక్తి సాగరంలో కంఠదఘ్నంగా మునిగిన వారే అనుమానం లేదు. అయినా విద్యావతులుకాని గొపికల నిసర్గ మధురమైన భక్తి భావమెంత నిర్వ్యాజమో ఎంత గాఢమో తెలుపదలచాడు వారికా ఈశ్వరుడు. భక్తిలోని గాఢత్వాని కొక్కటే నిదర్శనమది భగవద్వియోగా సహిష్ణుత. తన్నిమిత్తంగా సాగే నిష్ణురోక్తులూ. ఇది మనకు గోపికలు పట్టుననే కనిపిస్తుంది. మరి ఎక్కడా కనుపట్టదు. వారు కృష్ణ వియోగమొక్క క్షణకాలం సహించరు. అక్రూరోద్ధవుల నాడి పోసుకొన్న దందులకే. కడకు తమ ప్రాణనాథుడైన కృష్ణుణ్ణి కూడా నిష్ఠురా లాడేందుకు వెనుదీయలేదా సుందరులు. వారి ప్రగాఢమైన భక్తి ఎలాంటిదో ప్రౌఢులైన ఉద్ధవాదులు కూడా గ్రహించాలనే పరమాత్మ వారికలాటి సుకుమారమైన రాయబారం అప్పగించటం.
Page 290