భక్తుడు. అందుకేనేమో ఆయనను చూచేసరికి కృష్ణుడే తమ దగ్గరికి నడచి వచ్చినట్లనిపించింది నందాదులకు. అంతేకాదు. తరువాత గోపికలు కూడా ఆయన ఎక్కడో ఒక ఏకాంత ప్రదేశంలో ధ్యాన నిమీలిత లోచనుడై కూచొని ఉంటే పారజూచి
రాజీవాక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు - పీతాంబరుం జానుస్థిత బాహుడంబురుహ మాలా లంకృతు డుల్లస ద్రాజత్కుండలు డొక్క వీరు డిచటన్
రాజిల్లుచున్నాడు మా
రాజీవాక్షుని భంగినని భ్రాంతి పడతారు. సగుణభక్తిలో ఇది సారూప్యమనే భక్తి భూమిక. భగవద్రూపమే సంక్రమిస్తుంది భాగవతుడికి. అంతకన్నా స్పృహణీయమైనదేముంది.
ఉద్ధవుడికిలాటి భగవద్రూపమే గాదు. భగవత్తత్త్వ విషయమైన జ్ఞానం కూడా ఉంది.
బలుడుం గృష్ణుడు మర్త్యులే - వసుమతీ భావంబు వారింప వారల రూపంబున బుట్టినాడు హరి
అని చెబుతాడు గోపకులకు. అంతేకాదు. ఆ నారాయణుడఖిలాత్ముడు అఖిల భూతములతో ఇంధన జ్యోతిలాగా మెలగుతున్న తత్త్వమది. దానికి జననీ జనకదార సఖిపుత్ర బాంధవ శత్రుప్రియా ప్రియజనులంటూ ఎవ్వరూ లేరు. ఆయనకు జన్మ కర్మములును జన్మంబులును లేవు. గుణ విరహితుడయ్యు గుణవంతుడయి సర్వరక్షణ వినాశకేళి సలుపుతున్నాడా మహానుభావుడు. అలాంటి పరతత్త్వాన్ని చింతించు పరమభక్తుడు కూడా "అలఘు శ్రేయము బొందు బ్రహ్మమయుడై నిత్యుడై" అని భక్తి మార్గ నిర్గళిత రహస్యాన్ని కూడా బయటపెడతాడందరికీ.
అయితే ఉద్ధవుని ఇంత భాగవత దీక్షా పని చేయలేదా గోపకాంతల దగ్గర. వారు తమ్ము మోసగించిన ధూర్తగోపాలునే గాక ఆ ధూర్తునికి దూతగా వచ్చాడని చెప్పి ఇతణ్ణి కూడా ధూర్తుడుగానే భావించి ఉపాలంభించసాగారు. అక్రూరుడిలాగానే ఉద్ధవుణ్ణి కూడా అనరాని మాటాలంటారు. “భ్రమరాదుర్జన మిత్ర” ఆ కృష్ణుడు దుర్జనుడైతే ఆయన మిత్రుడవు నీవు ఇద్దరూ భ్రమర స్వభావులే. కృష్ణుడు మంచివాడని మాకెందుకు ఘోషపెడతావు. మరెవరి దగ్గరైనా ఏ కరువు పెట్టు నీకింత తిండి
Page 289