ఇదంతా ఒక నటన పరమాత్మకు. నిజానికిది తన కోసం కాదు. భక్తుల
కోసం. ఒక భక్తుడి చిత్తవృత్తి ఎట్టిదో మరొక భక్తుడు గ్రహించాలి. తనదే కాదు భక్తి
అంటే. అంతకు మించిన భక్తి మరొకరికి కూడా ఉండవచ్చు లోకంలో. అది
స్వయంగా పోయి కనులారా చూస్తే చెవులారా వింటే తన మనసులో దాగి ఉన్న
గర్వగ్రంథి విరిసిపోగలదు. నిరహంకారమైన భక్తే నిజానికి భక్తి. అంతేకాదు. తన
సమక్షంలోనే కాదు. పరోక్షంలో కూడా భక్తి నిలవాలి మానవులకు. అదే నిజమైన
దీక్ష. అది నీకు నిజంగా ఉందోలేదో మరొకరిని చూచి అయినా తెలుసుకోమని
భగవానుడు చేసే పరీక్ష అయినా కావచ్చు. అంతేకాదు. ఒక చోట కూచొని నా
మూర్తిని దర్శిస్తూ నన్ను స్మరించటమే గాదు. నా మూర్తినందరిలో దర్శిస్తూ నా
పనులు చేసి పెడుతూ, తద్వారా నా లోకహితచర్య నీవూ కొంత పంచుకొని చేసినప్పుడే
అది భాగవత భక్తి ప్రచారమని కూడా కావచ్చు. ఇన్ని మార్మికమైన అంతరార్ధాలున్నా
యిందులో. ఈ దృష్టితోనే ఇలాంటికార్యాలీ మహాభాగవతుల కప్పుడప్పుడూ పురమా
యిస్తుంటాడు పరమాత్మ. వీరిరువురకే పురమాయించాడంటే ఆయనకు వీరెంత
సన్నిహితులో చెప్పమని లేదు. ఉద్దవుణ్ణి పంపేటపుడు పైగా ఒక మాట అంటాడు.
"లౌకిక మొల్లక నన్నా - లోకించు ప్రపన్నులకును లోబడి కరుణా లోకనముల
బోషింతును. నాకాశ్రిత రక్షణములు నైసర్గికముల్” ఇది ఎంతో సాభిప్రాయమైన
మాట. లౌకిక విషయవాగురలో తగులుకొనక అలౌకికమైన తన భావాన్ని అంటి
పట్టుకొన్న వారినెప్పుడూ తాను తప్పజూడడట. వారిని రక్షించటమే తనకు నైజమట.
ఇది గోపికలకు చెప్పమని ఉద్దవుడితో అన్నాడంటే ఉద్దవుడి విషయంలోనూ అది
వర్తిస్తుందనే గదా భావం. అందుకే మందహాసం చేస్తూ ఆయనను సాగనంపుతాడు.
ఈ మందహాసమే కొంపదీసే మందహసం. దీని సంగతి తరువాత మనవి చేస్తాను.
సరే. ఉద్దవుడు బయలుదేరుతాడు. నంద గోకులానికి పోయి నందాదులను కలుసుకొంటాడు. ఆ పుణ్యాత్ముని కౌగిలించుకొని నందాభీరు డానందియై మాపాలింటికా కృష్ణుడీతడనుచున్ మన్నించి పూజించాడట. చూడండి. ఇక్కడ ఒక విశేషం గమనించాలి మనం. అక్రూరుడి కంటే ఉద్దవుడి స్థాయి ఇంకా ఒక మెట్టెక్కువగా కనిపిస్తున్నది. అక్రూరుడాయన విరాడ్రూపాన్ని దర్శించగలిగాడంత వరకే. ఈయన అలాగాదు. ఆ రూపాన్నే తన రూపంగా భావించగలిగిన పరమ
Page 288