#


Index



సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

భక్తి భావంతో పులకించాడు. అనతి దూరంలో తన సర్వస్వమైన రామకృష్ణుల దివ్యమూర్తులను దర్శించాడు. అవశుడై పోయి వారి పాదములను స్పృశించాడు. వారాయనను కౌగలించుకొని బంధు మిత్రాదుల క్షేమమడిగి వచ్చిన కార్య మెఱిగింపుమంటారు. ధనుర్యాగ విషయం విన్నవిస్తా డక్రూరుడు నిజమే అలాగే వెళ్లి చూడాలి తప్పదు గదా. పాలు పెరుగు నెయ్యి కట్నాలుగా కట్టి పెట్టండని హెచ్చరిస్తాడు గోపాలురను కృష్ణుడు. ఇంతలో గోపికలంతా అయ్యో అక్రూరుడు వచ్చి మన గోపాల కుమారుణ్ణి కొనిపోతున్నాడే అని గగ్గోలు పడతారు. అక్రూరుడని పేరు పెట్టుకొన్నాడే గాని నిజానికింత కన్నా క్రూరుడు లేడని ఆడిపోస్తారు. ఉఱుముఱిమి మంగలం మీద పడిందని చూడండి ఎలాటి నీలాపనింద వచ్చిందో ఆ మహాత్ముడికి. కంసుడి లాంటి క్రూరుడే ఆయన నక్రూరుడని అంతగా మెచ్చుకొంటే గోపికల లాంటి భక్తులే ఆయనను క్రూరుడని తిట్టి పోస్తున్నారు. ఆ భక్తుల చేతనే అక్రూరుడనిపించికొన్నవాడు పరమ భక్తులకు క్రూరుడెలా అయినాడు. ఇదే మానవుల దృష్టి భేదం. ఎవరి దృష్టితో వారు చూస్తారు భాగవతుణ్ణి. ఆ చూడటం కూడా తమ ప్రయోజనాన్ని బట్టే. తమకు పని బడితే దుర్మార్గులు కూడా మనకు సర్మార్గుడనే బిరుదు నిచ్చి పూజిస్తారు. తమ పనికి విఘాతం కలిగితే ఎంత సన్మార్గుడైనా వారి పాలిటికి దుర్మార్గుడు గానే కనిపిస్తాడు. ఇది కేవలం లోకుల దృష్టి మాత్రమే. అంత మాత్రాన ఒక సజ్జనుడు దుర్జనుడు కాడు. ఆయన సౌజన్యమెప్పుడూ సౌజన్యమే. అది లోకులకు తెలియదు. లోకేశ్వరుడైన పరమాత్మకే తెలిసిన తత్త్వం.

  అందుకే తన్ను నిత్యమూ అంటి పట్టుకొన్న గోపికలను లెక్కచేయక వారి పట్టు విడిపించుకొని పయనమయినా డక్రూరుడితో. దారిలో యమునా నది తారసిల్లింది. దిగి స్నానాదులు గావించి రామసహితుడై కృష్ణుడు రథంలో వచ్చి కూచుంటాడు. అక్రూరుడు కూడా నదిలో దిగి మజ్జనం చేసి వేదమంత్రాలు జపిస్తూ అలా చూచేసరికి జలమధ్యంలో రామకృష్ణుల రూపాలు కనిపిస్తాయి. ఇదేమిటి వీరు రథంలో గదా వెళ్లి కూచున్నారు. ఈ జలంలో కెప్పుడు వచ్చారని తల పయికెత్తి చూచేసరికి మరలా రథంలో కనిపిస్తారు. ఆశ్చర్యపోయి ఇంతకూ జలంలోనా రథంలోనా అని మార్చి మార్చి చూడగానే ఇటూఅటూ కూడా ఏకకాలంలో గోచరిస్తారు. ఇది ఏదో దేవరహస్యం భేదించాలని మరలా శిరోదఘ్నంగా నీటిలో

Page 283

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు