సూరులు దొల్లియే విభుని శోభిత పాద నఖ ప్రభావళిం జేరి భవాంధకారముల జిక్కక దాటుదు - రట్టిదేవరన్ వైరము తోడనైన పిలువన్ నను బంచి శుభంబు సేసె-ని ష్కారణమైన ప్రేమనిదె కంసుని బోలు సఖుండు గల్గునే
అని తంతే పూల పానుపు మీద పడ్డట్టు కంసుడే ఉద్దేశంతో చేసినా అది తన పాలిటి కొక మహాభాగ్యమని ఆనందిస్తాడు. ఇంకా ఆయన కొక అద్భుతమైన ఆలోచన వస్తుంది. "ఇతడా కంసుని చేత పంపు వడినన్ హింసింప నేతెంచినా డతి దుష్టుండని చూచూనో” ఇంతకు పూర్వం పూతనాది రాక్షసులెందరో కంసుని చేత పంపబడి వచ్చి ఆయన చేత చంపబడ్డారు. అలాగే వీడు కూడాకంసుని దూతగా వస్తున్నాడు. నన్ను హింసటానికేమో నని నన్ను కూడా రూపుమాపడు గదా ఆ పరమాత్మ అని సందేహించి మరలా వెంటనే "సకల భూతాంతర్బ హిర్మధ్య సంగతుడౌటం దలపోసి నన్ను సుజనుంగా జూచునో” అయినా నాకెందుకీ భయం ఆయన పరమాత్మ గదా సకల భూతాంతర్యామి అయిన ఆ మహాత్ముడికి నా అంతరంగమెలాంటిదో తెలియదా అని ధైర్యం తెచ్చుకొంటాడు. ఇందులో మొదటిది లౌకికమైన ఆలోచన. రెండవది భక్తుడికి కలిగే పరిశుద్ధ భావన. ఇది ఆ మొదటి దాన్ని త్రోసిరాజని ముందుకు వస్తుంది. సాధకుని ముందుకు నడుపుతుంది. కనుకనే,
మాపటి వేళ నేనుజని మాధవు పాద సమీప మందు దం డాపతి తుండనైన – నతడా శుగకాల భుజంగ వేగ సం తాపిత భక్తలోక భయ దారణమైన కరాబ్జమౌదలన్ మోపి హసించి నా కభయమున్ కృప తోడత నీయకుండునే
అని తనలో తానే సమాధానం చెప్పుకొంటాడా మహాభక్తుడు. దాసుని తప్పులు దండంతో సరి అన్నారు పెద్దలు. శత్రువునైనా శరణంటే మన్నించే పరమాత్మ పాత్రుడైనవాడు పాదపతితుడైతే ఉపేక్షిస్తాడా. ఆమెలకువ తెలిసిన వాడక్రూరుడు. కనుకనే అలాంటి పవిత్రమైన ఆలోచన కలిగిందా మనసుకు.
మనస్సును మించిన స్వదస్సుతో వెళ్లాడు ముందుకు. బృందావనం ప్రవేశించాడు. అక్కడ జలజాంకుశాది రేఖలుగల హరిపాదముల చొప్పు తిలకించాడు.
Page 282