#


Index



సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

యాదృచ్ఛికం. బహుశా యోగభ్రష్టులయి ఉంటారా మహానుభావులు. పూర్వమెప్పుడో యోగాభ్యాసం చేసి చేసి అది ఫలించకుండానే మరణించి ఉంటారు. “అధవా యోగినా మేవకులే భవతి" అన్నట్టు దాని ఫలితంగా ఈ జన్మలో యోగీశ్వరేశ్వరుడైన కృష్ణ భగవానుడి వంశంలో వచ్చి పడి ఉంటారు.

  ఇందులో ఉద్ధవుడాయన కమాత్యుడూ, ఆచార్యుడూ ప్రాణ స్నేహితుడూ అయితే, అక్రూరుడు వరుసకు తండ్రిలాంటి వాడాయనకు. బంధుండవు సద్యోహిత సంధుండవు, వావిజూడ జనకుడవని కృష్ణుడే అంటాడా మాట. అయినా పరమాత్మకు తండ్రులేమిటి. తల్లులేమిటి. అది ఒక నటన. అందరూ ఆయనకు భక్తులే. తదీయ గుణ గణాసక్తులే. అలాంటి వాడే ఈ అక్రూరుడు. క్రూరుడు కాని వాడక్రూరుడు. ఆయన పేరే చెబుతున్న దాయన ఎంత సౌమ్య స్వభావుడో. అయితే అక్రూరుడైనా క్రూరుడైనా కంసుణ్ణి కాదనలేకపోతాడు. సరిగా రామాయణంలో విభీషణుని లాంటివాడు. భీషణుడు కానివాడు విభీషణుడయినట్టే క్రూరుడు కాని వాడక్రూరుడు. అన్నగారి దుండగా లాయన సహించినట్టే సహించాడు అక్రూరుడు కూడా కంసుని దుండగాలు. ఆయన చివరకన్నను కాదని వెళ్లిపోయినట్టే ఈయనా సందేశమనే నెపంతో కంసుని పట్టణం విడిచి వెళ్లిపోయాడు.

  కృష్ణుడు వ్రేపల్లెలో ప్రచ్ఛన్నంగా వసిస్తున్నాడని నారదుడు చెప్పగా విని దానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకొన్న తరువాత ఎలాగైనా రామకృష్ణులను దగ్గరికి రప్పించి వారిని మట్టుపెట్టదలచాడు కంసుడు. అందుకోసం ధనుర్యాగమనే ఒక మిష కల్పించాడు. అప్పుడ క్రూరుణ్ణి పిలిపించి భుజంమీద చేయి వేస్తూ ఇలా అంటాడు. "అక్రూరత్వము తోడ నీవు మనగా నక్రూరనామంబు నిర్వక్రత్వంబున జెల్లె మైత్రి సలుపన్ వచ్చున్ నినుంజేరి నీ వక్రోధుండవు" కనుక నిన్ను పంపుతున్నాను. నీవు పోయి బలరామకృష్ణులను నాకు తెచ్చి ఒప్పగించమంటాడు. చూడండి. క్రూరుడైన కంసుడు కూడా ఆయనను అక్రూరుడని సంబోధిస్తాడు. అలాంటి నీతో మైత్రి సలపటం ఎవరికైనా శ్రేయస్కరమే నంటాడు. క్రూరస్వభావుల వల్ల కూడా సేబాసనిపించే ప్రశంసాపత్ర మందుకొన్నాడంటే అది ఎంత గొప్పతనమో చెప్పబని లేదు. పైగా మైత్రి సలుపవచ్చునట. సజ్జనులెప్పుడూ ఇరుపక్షాల వారికీ విహితంగానే ఉంటారు. పరస్పరంకారాలు మిరియాలు నూరుకొనే ఇరువాగులవారు కూడా

Page 280

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు