గోపికలా దేవతాస్త్రీలలైన అప్సరసలేనని పేర్కొన్నాము. అదీ ఒక సంకేతమే. వాస్తవానికీ దేవతలూ దేవకన్యలూ ఎవరో గాదు. మానవుడి ఇంద్రియ వ్యాపారాలే దేవతలు. దీవ్యతి ప్రకాశతే ప్రత్యర్థ మితి దేవః దేవతా శబ్ద స్పర్శాదులైన ప్రతి ప్రాపంచిక విషయమూ దేనివల్ల ప్రకాశిస్తున్నదో అదిదేవత. త్వక్చక్షు రాదీంద్రియ వ్యాపారాల మూలంగానే కదా అది. అవి అనంతకోటి ఆ వ్యాపారాలు. అనంతకోటి దేవతలీ వ్యాపారాలే. వీరే గోపకులు. గోపనశీలమైన ఇంద్రియ వ్యాపారాలే గోపకులు. పోతే తజ్జన్యమైన అనుభూతులేవో అవి గోపికలు. గోప గోపికలంటే ఇంద్రియ వ్యాపారాలు వాటి అనుభూతులే ఇంతకూ. ఇవి మామూలూ అయితే బాహ్య ప్రపంచాభి ముఖంగానే ప్రసరిస్తుంటాయి. అందులో సుఖాన్నే చూరగొనాలని ఆసిస్తుంటాయి. దాన్ని దాచుకొని దగ్గర పెట్టుకోవాలనే తాపత్రయ పడతాయి. అదేగోపనమంటే. కాముకులైన దేవజాతులకిది నిసర్గసిద్ధం. అది ఉన్నంత వరకూ ముక్తిలేదు. భక్తి ఉంటే గదా ముక్తి. దానికే నోచుకోలేదు మొదటవారు. అంచేత ప్రపంచాభి ముఖంగా వెళ్లే వాటిని భగవదభి ముఖంగా మళ్లించాలి మొదట. అందుకే దేవయోనులైన స్త్రీ పుంస వర్గమంతా ఇలా గోపగోపికలుగా అవతరించింది. కృష్ణ వేష ప్రతిచ్ఛన్నుడైన పరమాత్మనలా అనుక్షణమూ సేవిస్తూ వచ్చింది. పరమాత్మ నుంచి జనించిన ఈ కళలన్నీ ఎప్పటికైనా ఆ పరమాత్మనుచేరవలసిందే. అందులో లయం చెందవలసిందే.
“యథా నద్యః స్యందమానా స్సముద్రే స్తం గచ్ఛంతి నామరూపే విహాయ తథా ఇమాః కలాః పురుషాయణాః పురుషమ్ ప్రాప్య అస్తమ్ యంతి" అనే శాస్త్ర వాక్యానికిది శేషభూతమైన అర్థవాదం. అంతకన్నా మరేమీ లేదు.
గోపగోపికా జన వృత్తాంతమైన తరువాత ముఖ్యంగా పరిగణించవలసిన పరమ భాగవతులిద్దరే ఇద్దరున్నారు. ఒకడు అక్రూరుడు. మరొకడు ఉద్దవుడు. వీరిద్దరూ కృష్ణుని వంశంలో జన్మించినవారే. ఆయనకు సంబంధులే. "సంబంధులై వృష్ణులున్” అని నారదుడు చెప్పినట్టు వీరిది సంబంధభక్తి. అయితే అలా చెప్పటం కూడా అంత సరిగాదేమో. ఏమంటే సంబంధులాయన కెందరు లేరు. ఉగ్రసేన శూరసేన కంసాదులంతా సంబంధులే గదా. వారందరికీ ఆయన యెడల భక్తి ఉందా పెట్టిందా. కాబట్టి సంబంధమనేది అకించిత్కర మిక్కడ. అది ఉన్నా లేకున్నా భక్తి అనేది ఉన్నవాడి కున్నది. లేని వాడికి లేదు. అక్రూరోద్దవులు యదువంశంలో పుట్టటమనేది
Page 279