కోలుపోయిన పేదలలాగా కృష్ణుని సన్నిధి కోలుపోయిన గోపిక లోపికలు లేక చీకాకు పడసాగారు. మరలా వారి నేడిపించటానికా అన్నట్టు కృష్ణుడు వారి చెంత కుద్ధవుణ్ని పంపుతాడు. “నాపై జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నారాక గాంక్షించుచున్ గోపాలాంగన లెంత జాలిఁబడిరో” చూచి రమ్మని పంపుతాడు. పైగా "సందేహము మానుండర విందా ననలార మిమ్ము విడువను వత్తున్” “నాకాశ్రిత రక్షణములు నైసర్గికముల్” అని ఆయన ద్వారా తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ వారికొక సందేశం పంపుతాడు. అయితే ఆయన వ్రేపల్లెకు వచ్చి ఆ సందేశ వచనాలు వారికి వినిపించే లోపలనే వారు సహనం కోలుపోయి వచ్చిన వాడినీ, పంపిన వాడినీ, ఎవరినైనదీ తెలియని దశలో దశ దిశలూ మారు మోగేలాగా నానావిధాలైన నిష్ఠురోక్తులూ సాగిస్తారు. దగ్గరగా తిరుగుతూన్న ఒక భ్రమరం మీద నెపం పెట్టి ఎగ్గులాడుతారు. "భ్రమరా దుర్జన మిత్ర ముట్టకుము మా పాదాబ్జముల్" ఎందుకని “నాగర ప్రమదాళీ కుచకుంకు మాంకిత లసత్రాణేశ దామ ప్రసూనమరం దారుణి తాన నుండవగుటన్” అంతేకాదు. నిలకడ కూడా లేనిదానివి నీవు. “ఒక పువ్వందలి తేనెద్రావి మధుపాయుత్సాహివై నీవు వేఱకటిం బొందెడి దానవే గదా. ఇలా నిష్ఠురంగా మదనోన్మాదులై పలుకుతుంటే ఉద్దవుడు వారి నూరడిస్తూ "విశ్వేశుపై మీకజ సటుధ్యానము లిట్లు నిల్చునే” ఎంత చిత్రమో గదా మీ చరిత్ర కృష్ణుడు మీకు చెప్పమన్న మాటలివి. "కలగని లేచి మున్ను గల గన్న సమస్త విధంబు గల్లగా దలచిన భంగి” తదుడైన వాడీ ప్రపంచాన్ని చూస్తాడు. మీరూ ఆతదుల మార్గంలో మెలగాలని నా ఆశ. అందుకే ఈ మార్గంలో నన్ను మీరలు చింతించుచు నుండగోరి యిటు దూరస్థత్వముం బొందితిన్” "తలకం బోలదు నన్ను గూడెదరు నిత్య ధ్యానపారీణలై” ఇదే ఆఖరి మాట. ఇక కృష్ణుడు వచ్చింది లేదు. వారిని చూచింది లేదు. నిత్యధ్యాన పారీణలై ఉండటమే వారు పాటించవలసిన విధి.
ఇదే చివరకే భక్తుని విధి అయినా సగుణభక్తి మానవుని తరింపజేయదు అది ఒక ఆలంబన మాత్రమే. దానిని విడవకుండా నిత్యమూ పట్టుకొని కూచున్న వాడికదే కొంతకాలానికి నిర్గుణంగా పరిణమిస్తుంది. దానికి భగవన్మూర్తి ఇక కనిపించగూడదు. అది పూర్తిగా అంతర్హితమై పోవాలి. అప్పుడే నిలకడ భక్తికి. ఇలాటి భక్తి నలవరుచుకొని జన్మ తరింపజేసుకోటానికే జన్మంచారీ గోపికలూ ఆ గోపకులు. గోపకులు దేవతలైతే
Page 278