#


Index



సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

  మరి ఆయన సామాన్యుడా. “యే యధామా మన్నట్టు” వారెంతో తానూ అంతే.

తను రావే యని చీరి యేడువ జగత్రాణుండు - త్రైలోక్యమో హనుడై మన్మథ మన్మథుం డయి - మనోజ్ఞాకారియై - హారియై ఘన పీతాంబర ధారియై పొడమె

  వారు కోరిన రూపంతోనే ప్రత్యక్షమవుతాడు. వెంటనే తమ వల్లభుడు విచ్చేశాడని వికసిత ముఖులై ఆ సఖులు ఒకతి ఆయన కేలు పట్టుకొంటే ఒకతి చేయి భుజం మీద వేసుకొంటే ఒకతె తాంబూల మాసిస్తే మరొకతె ఆయన మృదులమైన పదాలు తన పరితప్త కుచాలమీద పాదుకొల్పుతుంది. ప్రేమాతి శయంతో నిష్ఠురోక్తులాడుతారు. అంతేకాదు.

  కొలిచిన గొలుతురు కొందఱు
  కొలుతురు తము గొలువకున్న కొందఱు పతులన్
అని సాభిప్రాయంగా మాటాడుతా రాయనతో. దాని కాయన జవాబిస్తూ “ఏనిం దెవ్వడనైనంగాను, మానస బంధుడ నిత్యధ్యానము మీకొసగవలసి తలగితి" నని తన అంతర్ధానంలోని అసలు రహస్యాన్ని బయట పెడతాడు. ఇంకా ఒక మంచి చురక పెడతాడు వారికి.

నను సేవించుచు నున్న వారలకు నేనా రూప ముం జూప జూ చిన భావించి మదించి వారు మఱినన్ సేవింప రోయంచు

  ఇది భగవానుడి భయం. ఒక విశిష్టమైన రూపంతో కనిపిస్తే ఇదే శాశ్వతం ఇంతకన్నా మరేమి కాదు. మరి ఇదెప్పుడు మాతో తిరుగుతూ మన అధీనంలో ఉన్నదే గదా అనే సంకుచిత భావమేర్పడుతుంది భాగవతులకు. అలాకాక వారికీ విశాల విశ్వమంతా భగవద్రూపమేననే దృష్టి ఏర్పడాలంటే తాను తన రూపాన్ని ఉపసంహరించాలి. అప్పుడా రూపాన్ని చూడాలనే తహతహతో సృష్టిలో ప్రతి ఒక్కటీ అన్వేషిస్తూ పోతాడు సాధకుడు. భగవదంతర్ధానాన్ని తమ కేర్పడిన మానధనాన్ని అపహరించి తమ కసలైన తత్త్వాన్ని చాటటంగా కూడ అర్థం చేసుకొంటారు. ఇదే అప్పుడప్పుడు కృష్ణుడి అంతర్ధానంలో ఇమిడి ఉన్న ఆంతర్యం. వియోగానంత రోపనతమైనపుడే సంయోగంలోని విలువ గుర్తిస్తాడు సాధకుడు. అలాగే గుర్తించారు

Page 276

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు