దీనిని బట్టి గోపికా కృష్ణుల వ్యవహారమెట్టిదో ఇక మనం బాగా అర్థం
చేసుకోవచ్చు. పైకి భౌతికంగా అశ్లీలంగా కనిపించినా అది అభౌతికం. ఆదర్శప్రాయం.
బాల్యం నుంచీ కృష్ణుడు వారిపట్ల చేసిన అల్లరి చేష్టలన్నీ భగవంతుడు భక్తులను
అజ్ఞాన నిద్రనుంచి మేల్కొలపటమే. వారిని రెచ్చగొట్టటమే. తన ఉనికి నెఱిగించటమే.
ఎలయించటమే. అది గమనించారా గోపికలు కొంత కాలానికి. ఆయన సాంగత్యం
కోసమాసించారు. తమ సర్వస్వమూ సమర్పించారు. క్షణమాలస్యమైతే భరించలేక
పోయారు. కనిపించకపోతే కలవరపడ్డారు. అయితే నిజంగానే వీరు తనకుసర్వస్వమూ
అప్పగించారా లేదా అని ఆ పరమాత్మ వారిని తానుకూడా పరీక్షిస్తుంటాడు. అలాటి
ఒక పరీక్షే వస్త్రాపహరణం. లోతుకు దిగకుండా పైకి చూస్తే ఇది మహాబూతు.
రాడీ చేష్ట, కాని భౌతికం కాదని గదా ముందే చెప్పాము. భౌతికమైన ఈ తెరమరుగున
ఎంతో ఆధ్యాత్మకమైన భావమున్నది. ఏమిటది. వస్త్రమంటే జీవులకున్న
దేహాభిమానం. అది ఉన్నంత వరకూ ఈశ్వర సాయుజ్యానికి నోచుకోలేము. జీవుడు
తన పాటికి తాను వదలుకోలేడది. ఈశ్వరానుగ్రహం కూడా తోడు కావాలి దానికి.
అందుకే వారి నేమరించి వారి వస్త్రాలపహరించాడు కృష్ణుడు. నీళ్లలో నుంచి ఇవతలికి
రమ్మన్నాడు. ఆ కొలను సంసారమే. దానిలో నుంచి ఎంతగా పరమాత్మ హెచ్చరించినా
బయటపడటమిష్టం లేదు వారికి. చివరకు పడక తప్పింది కాదు. చేతులెత్తమని
కూడా అంటాడు. ఇది మరీ అన్యాయంగా కనిపిస్తుంది. కాదు. చేతులతో
గోప్యాంగాన్ని కప్పి పుచ్చుకొన్నారు వారు పరమార్ధంలో కప్పి పుచ్చుకోవలసిందేదీ
లేదు. ఎందుకంటే సర్వత్రా ఉన్నాడీశ్వరుడు. "అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య
నారాయణః స్థితః" అలాంటప్పుడు కప్పి పుచ్చినా కనపడక పోదు గదా. ఇక ఏమిటి
కప్పుకొనేది మనం. “తేనత్యక్తేన భుంజీథాః” అన్నట్టు మనకున్న సర్వమూ త్యజిస్తే
గాని ఆ తత్త్వంతో సాయుజ్యాన్ని భజించలేము మనం. ఇదే ఈ కథలోని సారాంశం.
పోతే రాసక్రీడలు. జలక్రీడలు. ఇవన్నీ జీవేశ్వరుల సంసర్గమే. మరేదీ గాదు. అనన్యమైన సగుణభక్తికిది పరసీమ. ఇందులోని ఆంతర్యం భాగవతమే బయట పెట్టింది. పరీక్షిత్తు లౌకికంగా భావించి ప్రశ్నిస్తే శుకుడు దాని కలౌకికమైన స్థాయిలో సమాధానమిస్తాడు. సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడికే దోషమూ ఎలా అంటదో పూర్ణ జ్ఞానైశ్వర్య సమన్వితుడైన పరమాత్మకే వ్యవహారమూ అంటదు పొమ్మంటాడు. అలాంటి
Page 273