#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

  అని వాపోతాడు. దీనిని బట్టి బ్రహ్మపదంలో ఉన్నా బ్రహ్మతత్త్వం అంతు పడుతుందని నమ్మకం లేదు. అంతకన్నా ఏ ఉన్నత పదంలో లేకపోయినా సామాన్యుడికే అది సులభం కావచ్చు. దానికి కారణమొక్కటే. అది ఆలాపాది సమస్త భావములూ ఆయన కర్పించి జీవించటమే. మరేదీ గాదు.

  ఇలా జీవించా రాగోపకులు. జల జాతాక్షుడు రాముడున్ నటనముల్ సల్పంగ గోపాల మూర్తులతో గొల్చు నిర్జరులు సంతోషించి వేణు స్వనంబులు గావించుచు కొమ్ములూదుచు శిరంబుల్ ద్రిప్పుచున్ బాడుచు తిరుగుతుండేవారు. మాపాలికి బలకృష్ణులు భూపాలకులంచు నెగిరి బొబ్బిలిడుచు వారిని నేలమీద నడవకుండా భుజాలమీద మోసుకొని పోయేవారు. ఆయన కేదైనా ఆపద జరిగిందంటే భరించలేక తల్లడిల్లేవారు. కాళియుడు కృష్ణుని చుట్టివేసినప్పుడా దృశ్యం చూచి ఇలా ఆక్రందన చేస్తారు.

అదె మన కృష్ణునిం గఱచి యంతట బోక భుజంగమంబు దు ర్మదమున మేను జుట్టుకొని మానక యున్నది - యింక నేమి సే యుద మెట జొత్తమే పురుషులోపుదు రీయహి నడ్డపెట్ట

  నని పెద్ద పెట్టున గోలపెట్టారు. అంతేకాదు. తమకెలాటి ఆపదలు వచ్చినా సరే ఆయనే రక్షకుడని భావించి మరలా మొరపెడతారు. “నీ పద పద్మంబులు గాని యొండెఱుగ మోపద్మాక్ష యోకృష్ణ మ్రొక్కెద మోరామ మహా పరాక్రమ” “నీ పాదంబులు నమ్మిన నాపద లెక్కడివి జనులకు నీ చుట్టాలకు నాపదల్గలుగునే మేమెల్ల నీవార మన్యాచారంబు లెఱుంగ మీశుడ”వని ఈశ్వర తత్త్వమెంతో తెలిసిన వారిలాగా కూడా కనిపిస్తారు. ఇంతెందుకు. తెలుసునో తెలియదో పరమాత్మతత్త్వం వారికి. మొత్తానికి కృష్ణ పరమాత్మే లోకంగా ఆయనే తమ జీవిత సర్వస్వంగా బ్రతికారా గోపకులు. "మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాంన మస్కురు మయ్యర్పిత మనోబుద్ధిః" అన్న భగవద్వాణి కుదాహరణ ప్రాయం వారి జీవితం. అంతేకాదు. అన్యాచారంబు లెఱుంగమని వారన్నట్టు అది కూడా “యేశాస్త్ర విధి ముత్సృజ్యయ జంతే శ్రద్ధయా న్వితాః అన్యేత్వేవ మజా వంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే” అనే భగవద్వాక్యాని కనురూపమే.

Page 270

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు