#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

మొదట గోపకుల వృత్తాంతమే తీసుకొని చూతాము. కృష్ణుడితో పాటు పుట్టారు పెరిగారు వీరు. కృష్ణుడెక్కడో పుట్టినా వచ్చి పెరిగింది వీరి మధ్యనే. పరమాత్మ వెతుక్కుంటూ వచ్చాడప్పటికి తన భక్త జనాన్ని. లేకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడో అర్థం చేసుకొనే తాహతులేదు గదా వారికి. ఇలా తనసన్నిధానంవారి కనుగ్రహించటం వారి ప్రయత్నానికి చేయూతనీయటం. అది చక్కగా అందుకొన్న్నారా బాలురు.

  గో వల్లభుడ నేను గోవులు మీరని వడి అంకెవైచుచు వంగి యాడు రాజనే భటులు మీరలురండు రండని ప్రాభవంబున పెక్కు పనులు పనుచు

  ఇలా కృష్ణుడెలా పంచితే అలా పనులు చేస్తూ పసితనం నుంచీ ఆయనకు పరిచర్య చేస్తూ వచ్చారు. అంతేకాదు.

  కపులమై జలరాశిగట్టుదమా యని కట్టుదు రడ్డంబు కాలువలకు మనులమై తపములు మొనయుదమాయ ని మౌనులై యుందురు మాటలేక

  ఇలా ఆయన చేసే చేష్టలన్నింటినీ తామూ అనుసరిస్తూ వచ్చారు. మరి ప్రతిరోజు ఆల కదువులను తోలుకొంటూ పోయి ఆయనతో పాటు బంతి చలుదు లారగిస్తారు. “ఒకనొకని చల్దికావడి నొక డొక డడకించి దాచు” “ఒక్కడు మున్నే మఱచన నొక్కడు బలు బొబ్బవెట్టు నులికి వడంగన్" ఇలా తమలో తామెన్ని అల్లరి చేష్టలు చేసినా “వనజాక్షుడు మున్నరిగిన మునుపడనేనేనె యతని ముట్టెద ననుచున్” పరమాత్మ వెంట పరుగిడేవారు. వారి చేష్టలు వర్ణించి చెబుతూ ఇలా అంటాడు శుకమహర్షి

ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయుం గన్నుల గానరట్టి హరి గౌగిట జేర్చుచు జెట్టబట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచు తద్దయు ఁబైపడి కూడి యాడుచున్ మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యము లింత యొప్పునే

  “యచ్చావ హాసార్థ మసత్కృతోసి విహార శయ్యాసన భోజనేషు” అని ఇలాంటి పనులు చేసినందుకెంతో ఒడ్డుకొంటాడొకప్పు డర్జునుడు. అతడు కేవలభక్తుడూ కాదు. కేవలజ్ఞానీ కాదు. కనుకనే అలా వాపోయాడు. మరి ఈ గోపబాలురో కేవల మూఢభక్తులు. వీరికి పరమాత్మ నిలా చేస్తున్నామే అనే భయంగాని సంకోచంగాని

Page 268

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు