డవుతుంది. జ్ఞానోదయమైతే అది ఎప్పుడు. భక్తియోగం పరిపాకానికి వస్తే. అంటే సగుణం నిర్గుణంగా మారితే. మొదలు సగుణానికే నోచుకోలేదు దేవతలు. కారణమేమంటేవారు భోగలాలసులు. కర్మయోగులై తత్ఫలంగా స్వర్గాది లోకాలు చేజిక్కించుకొన్న వారు కొందరైతే అసలు జన్మతోనే స్వర్గవాసులుగా జన్మించిన వారు కొందరు. ఇందులో మొదటివారు కర్మదేవతలు. రెండవవారు ఆ జాన దేవతలు. ఆ జానదేవతలూ అనాదిలో ఎప్పుడో ఒకప్పుడుత్తమ కర్మాచరణ మూలంగా అలా అయినవారే. మొత్తానికిధర్మానుష్ఠాన పరిపాక ఫలమే దేవతా జన్మ. ఇది కర్మ సమాధి యోగాలు రెంటివల్ల లభించే పదవేగాని భక్తి జ్ఞానాల మూలంగా కాదు. అందుకే ఈ సుర కిన్నర గరుడ గంధర్వ సిద్ధ చారణాది దేవయోనులందరూ చాలావరకు భోగదాసులే గాని పరమాత్మ దాసులు కారు. కారు గనుకనే వారికి భక్తి భావాన్ని కరపి బాగుచేయటానికా అన్నట్టు పరమాత్మ అప్పుడప్పుడు వారికి అసుర శక్తులవల్ల వల్ల మాలిన ఉపద్రవాలు కలిగిస్తుంటాడు. దానికి హడలిపోయి వారు కూడా పరమాత్మను శరణువేడి తదనుగ్రహంతో ఆ ముప్పు తప్పించుకొని అప్పటికప్పుడు బ్రతికి బయటపడతారు. అయితే అది సహజం కాదు గనుక పబ్బం గడవగానే మరలా యథాప్రకారంగానే భోగమయమైన జీవితాలు గడుపుతుంటారు. ఇదీ వీరి వరుస.
ఇలాటి పశుప్రాయమైన జీవితాన్ని తప్పించి వారి కప్పుడప్పుడుతదతీతమైన భగవద్భక్తి సంకురింపజేసి క్రమంగా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించటానికి వారినీ కర్మభూమిలో జన్మింపజేస్తాడా ఈశ్వరుడు. కర్మభూమిలో దేనికంటే ఇక్కడ దేవలోకాలలో ఉండే భోగభాగ్యాలూ లేవు. అణిమాద్యష్ట సిద్ధులూ లేవు. దీర్ఘ కాలికమైన జీవితం కూడా లేదు. మీదు మిక్కిలి అడుగడుగునా అధ్యాత్మకాది తాపాలూ క్లేశాలే తారసిల్లుతుంటాయి. అవి నిత్యమూ అనుభవిస్తేనే గాని జీవిత భోగాల మీద ఏవగింపు పుట్టదు వారికి. అయితే ఈ నిర్వేదమనేది ప్రతిలోమమే గాని అనులోమ మార్గం కాదు. అనులోమం భగవద్భక్తి. అది ఎలా లభిస్తుంది. ఎప్పుడో కష్టం వచ్చినప్పుడనే గాక కష్టంలో సుఖంలో అన్ని దశల్లో ప్రతి నిమిషమూ ఆ పరమాత్మతో కలిసి మెలిసికాపురం చేసినప్పుడే. అందుకే ఈ గోప గోపికల జన్మ. అది కర్మ సమాధి పరాకాష్ఠ నందుకొన్న దేవజాతి భక్తి జ్ఞానాలలో శిక్షణ పొందటానికని భూమిమీద ప్రభవించిన వ్యవహారం. దీని కనుగుణంగానే సాగింది వారి జీవిత వ్యవహారమంతా.
గోపికల దొక రకంగా అయితే గోపకులది మరొక రకంగా.
Page 267