#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

  పోతే ఇక గోప గోపికల భక్తి. ఇదికూడా సగుణమే. “కామోత్కంఠత గోపికల్” అని ఇది కూడా కామమనే వ్యాజంతో కూడిందే. అందులో గోపికలది కామమైతే గోపకులది సఖ్యం. దశమ స్కంధమంతా వీరి వ్యవహారంతోనే నిండి నిబిడీ కృతమయి ఉంది. కృష్ణుడు పుట్టింది మధురలోనైనా పెరిగింది వ్రేపల్లెలోనే. బాల్యమంతా అక్కడే గడచిపోయింది పరమాత్మకు. అయినా ఆయనకు బాల్యమేమిటి. పౌగండమేమిటి, కౌమారమేమిటి, వార్ధ్యమేమిటి. అదంతా ఒక నటన. ఒక క్రీడ. తన క్రీడకు మరికొందరు క్రీడాకారులను తోడు చేసుకోవలసి వచ్చింది. వారే గోపకులు. యాదవు లెవరో చెప్పింది భాగవతం. వారంతా కృష్ణ ప్రీతితో జననమందిన అమరులే నని.

యాదవ కులమున నమరులు మేదినిపై బుట్ట ఁజనుడు మీ యంశములన్ అని బ్రహ్మదేవుడు ముందుగానే వారి నాజ్ఞాపిస్తాడు. అంతేగాదు హరి పూజార్థము పుట్టుడు సురకన్యలు భూమియందు సుందరతనులై

  అని దేవతా స్త్రీలను కూడా ఆజ్ఞాపిస్తాడు. వారే గోపికలయి జన్మించారు. అప్సరః స్త్రీలు గోపికలైతే గోపకు లెవరప్పటికీ. వారా అప్సరః కాముకులైన గరుడ గంధర్వాది దేవతలే కావాలి. సందేహంలేదు. యాదవులే దేవతలని చెప్పినా గోపకులు ఫలానా అని చెప్పకపోయినా ఇది మన మూహించుకోవచ్చు.

  అయితే ఎందుకిలా జన్మించారు వీరంతా. హరి సహాయార్థమా. పరమాత్మకు వీరు చేసే సహాయమేమిటి. అలా చేసినట్టు ఒక సందర్భం కూడా కనిపించదు వారి జీవితంలో. మీదు మిక్కిలి అడుగడుగునా కృష్ణ భగవానుడే వారి నాదుకోవలసి వచ్చింది. అలాంటప్పుడెందుకు వీరిలా జన్మించటం. ఎందుకో గోపికల విషయంలోనే బయట పెట్టాడు మహర్షి హరి పూజార్థమని. భగవదారాధన కోసమే వీరందరి ఆవిర్భావమూ భగవంతుడికి తాము చేసేదేమీ లేదు. తమ కోసమే తమ ఆత్మోద్ధరణ కోసమే తాము జన్మ ఎత్తారు లోకంలో. దేవతలకు కూడా జన్మ ఉందా అని ఆశ్చర్యపడనక్కరలేదు. జన్మరాహిత్యమయ్యే వరకూ ఎవరైనా సరే జన్మించవలసిందే. వారు దేవతలే కాదు. మానవులే కాదు దానవులే కాదు. జన్మ రాహిత్యమెప్పు

Page 266

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు