వాసుదేవాం ఘ్ర్యను ధ్యాన పరి బృంహిత రంహసా భక్త్యా నిర్మధితా శేష కషాయ ధిషణో 2 ర్జునః గీతమ్ భగవతా జ్ఞానం యత్త త్సంగ్రామ మూర్ధని కాల కర్మ తమోరుద్ధమ్- పున రధ్యగమద్విభుః”
నిరంతర భగవచ్చింతా ప్రభావం వల్ల అతనికి పట్టిన మనః కాలుష్యమంతా ప్రక్షాళితమై పోయింది. అంతకు పూర్వమెప్పుడో రణరంగంలో విన్న గీతోపదేశం కాల కర్మముల ప్రాబల్యం చేత మరుగుపడిన దంతా ఒక్కసారిగా మనసుకు స్ఫురించింది. “విశోకో బ్రహ్మ సంపత్త్యా సంభినృద్వైత సంశయః” దానితో బ్రహ్మాకార వృత్తి నిలకడ చెందగాసంశయ శోకాలు రెండూ నశించి నిర్మల జ్ఞాన సంపన్నుడవుతా డతడు. అంతకుముందే విరక్తుడయినాడు ధర్మజుడు.
యయా హరద్భువో భారం తాం తనుం విజహా వజః కంటకం కంటకేనేవ - ద్వయం చాపీశితు స్సమమ్ యథా మత్స్యాది రూపాణి ధత్తే జహ్యాద్యథానటః భూ భారః క్షపితో యేన జహౌ తచ్చ కళేబరమ్
మత్స్యాది శరీరాలు ధరించటం పరమాత్మ కొక లీల. భారావతారణమే వాటి ప్రయోజనం. ముల్లు ముల్లుతో తీసి తరువాత ఆ రెండు ముండ్లూ పారవైచినట్లొక శరీరమెత్తి మిగతా శరీరాలను నిర్మూలించి ఆ తరువాత రెంటినీ వదలివేసి పోయాడాయన కవి రెండూ సమానమే అని అర్జునుడనే మాటలు గాఢంగా నాటాయి ధర్మరాజుకు. ఇక ఏ మాత్రమాలసించినా అది పామరత్వమే నని భావించాడు. తాము నమ్ముకొన్న విలువైన సొమ్మే కాల ప్రవాహంలో నష్టమై పోయింది. ఇక తాముండి సాధించేదేముంది. వెంటనే తీవ్రమైన వైరాగ్య భావంతో తమ్ములూ తానూ పరీక్షిత్తును రాజ్యాభిషిక్తుణ్ణి చేసి సర్వమూ పరిత్యజించి ఉత్తరదిశగా పయనమవుతాడు. అంతకు పూర్వమే వారి తల్లి కుంతి యోగంతో శరీరత్యాగం చేసింది. తాము కూడా “మనసా ధారయా మాసు ర్వైకుంఠ చరణాంబుజమ్" మనసులో వైకుంఠుని మూర్తిని నిలుపుకొని "తస్మిన్ నారాయణ పదే” ఆ నారాయణుని మార్గంలోనే “ఏకాంత మతయో గతి మవాపుః" అనన్య మనస్కులై అన్య జన దుర్లభమైన ఉత్తమగతి చెందారట
Page 264