#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

చూడగానే భయపడతాడేదో కొంప మునిగిందని. మరేదో గాదు. మాధవుని మరణమే. అందుకే ఆదుర్దాగా అడుగుతాడు.

b>అన్నా ఫల్గున భక్త వత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా పన్నా నీక శరణ్యుడీశుడు జగద్భద్రాను సంధాయి శ్రీ మన్న వ్యాంబుజ పత్ర నేత్రుడు సుధర్మా మధ్య పీఠంబు నం దున్నాడా బలభద్రుగూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్

  ఉత్సాహియై ఉన్న మాట వాస్తవమే గాని అది ద్వారకలో గాదు వైకుంఠంలో. ఆ మాటే చెబుతా డర్జునుడింకెక్కడి కృష్ణుడెక్కడి ద్వారక.

బలహీనాంగులకున్ బలాధికులకున్ ప్రత్యర్థి భావోద్యమం బులు కల్పించి వినాశము న్నెఱపి ఈ భూభారముం బాపి ని శ్చల వృత్తిం గృతకార్యుడై చనియె నా సర్వేశ్వరుండ”ని

  అసలు విషయం బయటపెడతాడు. కృష్ణుడంటే సర్వేశ్వరుడని కేవలం భూభార పరిహారార్ధమే అవతరించాడని పూర్తిగా గ్రహించాడర్జునుడు.

  అంతేకాదు. అతడు తమ బావ అని తమనేదో ఆపత్సమయాలలో ఆదుకొంటూ వచ్చిన ఆపద్భాంధవుడనే సంకుచిత భావం కూడా అతనికి తొలగిపోయింది. అది అతనిమాటలలోనే మనకు దాఖాలా అవుతుంది.

భూతముల వలన నెప్పుడు భూతములకు జన్మ మరణ పోషణములు ని ర్ణీతములు సేయుచుండును భూతమయం డీశ్వరుండు భూత శరణ్యా

  సకల చరాచర సృష్టి స్థితిలయాలు ఆ పరమేశ్వరుడి చేతిలోనివి. చరాచర భూతమయుడూ ఆయనే వాటి కతీతుడూ ఆయనే. మనమంతా కేవలం నిమిత్త మాత్రులమే నని తన పరాపరా విజ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు అర్జునుడు. అంతమాత్రమే గాదు. అంతకుముందు భగవత్సన్నిధిలో ఎంత గీతాశ్రవణం చేసినా ఒంటబట్టని ఆత్మ జ్ఞానమిప్పుడాయన ఆ సన్నిధిలోనే పాకానికి వచ్చింది.

Page 263

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు