బలం చేసిపోతాడు. ప్రస్తుతం కుంతి విషయంలో ఇలాగే జరిగింది. నాకు మోహవిచ్ఛేదం చేయమని ఆవిడ ప్రార్థిస్తే విచ్ఛేదం చేయకపోగా దాన్ని ద్విగుణీకృతంగా ఆవహించాడావిడకు శ్రీకృష్ణుడు.
పృథయేత్థమ్ కలపదైః - పరిణూతాఖిలోదయః మందమ్ జహాస వైకుంఠ -మోహయన్నివ మాయయా
ఈ విధంగా మేనత్త అవీ ఇవీ వలపోస్తూ ఉంటే ఏమీ మాటాడకుండా ఒక మందహాసం చేసి వెంటనే రథమెక్కి ద్వారకకు వెళ్లిపోయాడట. ఆవిడ అన్నివిధాల ప్రాధేయపడుతూంటే దానికి మందహాసమా జవాబు. పైగా ఇంకా కొంత కాల మిక్కడనే సన్నిధి చేసి మాకు తరుణోపాయం బోధించమని ఆవిడ బ్రతిమాలుతుంటే దానికి ఏమీ బదులు చెప్పక రథారోహణం చేసి పోవటమా అంతకన్నా జవాబు.
అవును. నిజమాలోచిస్తే పరమాత్మ దృష్టిలో అదే జవాబు. జీవుడికి దేవుడిచ్చే జవాబదే. ఇచ్చట కుంతిది అనన్యమైన నిర్గుణభక్తికాదు. సగుణ భక్తి. పరమాత్మనేదో ఒక పరిచ్ఛిన్నమైన రూపంలో చూచి దాన్నే కలకాలమూ తన దగ్గర నిలుపుకోవాలని కోరుతున్నది. పైగా స్వప్రయత్నమే కొంచెమూ లేకుండా తన సంగతి అంతా చివరకు తనకు కలగవలసిన మోక్షం కూడా ఆయనే ప్రసాదించాలని ఆసిస్తున్నది. ఇది వట్టి పేరాస. భక్తి మార్గంలో దీన్ని మార్జారకిశోర న్యాయమంటారు. ఒక పిల్లి తన పిల్లలను తానే నోట గరచుకొని పోతుంది. పిల్లలకేమీ జవాబుదారీ లేదు. అంతా తల్లిదే. అలాగే భక్తుడి బాగోగులన్నీ భగవంతుడే చూచుకోవాలని సిద్ధాంతమిది. మంచిదే.కాని దానికి కూడా నూటికి నూరుపాళ్లూ చిత్తశుద్ధి ఉండాలి. ఎలాటి వ్యాజమూ పనికిరాదు. అంతా తెలిసినట్టు నటించటమూ తన జీవిత ప్రయోజనాల కోస మర్ధించటమూ ఇదీ వ్యాజమంటే. ఇవి రెండూ ప్రస్తుతం కుంతీదేవికి లేకపోలేదు. కావలసినంత ఉంది. “పురుషుండాఢ్యుడు ప్రకృతికి పరుడని" భగవానుడి పరతత్త్వాన్ని ఎంతగానో కొనియాడింది. అంత విషయం తెలిసిన మనిషికిక మోహమెక్కడిది. లేకుంటే మరలా నాకు మోహవిచ్ఛేదము సేయమని ప్రార్ధించట మేమిటి. అంతేకాదు. కృష్ణుడు తన వారినీ తన్నూ మొదటి నుంచీ ఎలా కాపాడుతూ వచ్చాడో ప్రశంసిస్తూ అలాగే ఇక మీదట కూడా మమ్ముల్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ మా ఇంటనే ఉండి పొమ్మంటుంది. ఇది ఇంకా అవివేకం. ఆపదలలో
Page 257