ఇదే సగుణ భక్తుల దృష్టి, వారు భగవంతుణ్ణి ఎప్పుడూ సగుణంగానే భావిస్తారు. సగుణమనే సరికి ఒక నామంతో ఒక రూపంతో తమ మధ్య తిరుగుతూ చేస్తూ ఉన్న వ్యక్తిగానే చూస్తుంటారు. ఒకవేళ ఎప్పుడైనా ఆయన సామాన్యమైన వ్యక్తికాదు. విశ్వరూపుడైన పరమాత్మ అనే జ్ఞానమున్నట్టు కనిపించినా అది వారికి శ్రుతమైన. జ్ఞానమే గాని ఒంటబట్టిన అనుభవ జ్ఞానం కాదు. పెద్దలు చెబుతూ వచ్చిన తాము. వింటూ వచ్చిన మాటలనే ఏ కరువు పెడుతుంటారు. అలాగే ఏకరవు పెట్టింది. కుంతికూడా మొదట పరీక్షిత్తును చావకుండా కాపాడిన సందర్భం చూడగానే తాత్కాలికమైన భావావేశం పట్టజాలక ఇలా కీర్తిస్తుందా పరమాత్మ నావిడ.
పురుషుండాఢ్యుడు ప్రకృతికి బరుడవ్యయు డఖిల భూత బహిరంతర్భా సురు డనవ లోకనీయుడు పరమేశ్వరుడైన నీకు ప్రణవములు హరీ
అని కృష్ణుని నిర్గుణ తత్త్వాన్ని ఎంతో తాను గ్రహించిన దాని లాగా ప్రశంసిస్తుంది. "జననము నైశ్వర్యంబును ధనమును విద్యయును గల మదచ్ఛన్నులకు” నీవగోచరుడవు. అవి లేని పరిశుద్ధ మనస్కులకే సులభడవనే. ధర్మసూక్ష్మాన్ని వెల్లడిస్తుంది. కొందరు నీవు దేవకీ వసుదేవుల కిచ్చిన వర ప్రకార మవతరించావంటే కొందరు భూభారాన్ని పాపటానికంటే మరి కొంద రజ్ఞాన కామ్య కర్మఠుల మూఢత్వాన్ని తొలగించి వారికి శ్రవణ చింతనాది భక్తి మార్గాన్ని బోధించటాని కవతరించావని చెబుతున్నారని భగవజ్జన్మ రహస్యాన్నీ ప్రయోజనాన్నీ. బయట పెడుతుంది. "నిను జింతించుచు బాడుచుం బొగడుచున్ నీ దివ్య-చారిత్రముల్ వినుచుం” జూచినదే నిజమైన చూపని వర్ణిస్తుంది.
ఎంత వర్ణించినా ఇదంతా శ్రుత పాండిత్యమే. అభ్యాస జన్యమైన అనుభవం. కాదు. అలాటి అనుభవమే ఉంటే అది జ్ఞానం. జ్ఞానోదయమైతే మోహవిచ్ఛేదం దానిపాటికదే ఏర్పడుతుంది. విచ్ఛేదం చేయమని భగవంతుణ్ణి ప్రాధేయపడ నక్కరలేదు. మనం ప్రాధేయపడినా ఇంకా మనకు యోగ్యత లేకపోతే భగవంతుడు. సర్వసమర్ధుడయి కూడా మనకది ప్రసాదించబోడు. మీదు మిక్కిలి ఇంకా మనకది
Page 256