యోగమూ, భక్తియోగమూ రెండూ కూడా చివరకు జ్ఞానంతో పెనవేసుకొని చివరకు దానిలోనే చరితార్థమవుతున్నాయి. కాక తప్పేదేముంది. సర్వమ్ కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని గదా భగవద్వాణి. "జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసా త్కురుతే ర్జున” అది ప్రజ్వలిస్తే చివరకన్ని కర్మవాసనలూ జీవుడి కదే కాల్చి పారేస్తుంది. "జ్ఞానేనాత్మని విందంతి కేచి దాత్మాన మాత్మనా” ఈ జ్ఞానమే చివరకా సర్వాత్మ భావాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి కర్మయోగంలాగా సమాధి యోగం కూడా స్వయం సంపూర్ణం కాదు. అది ఒక సాధనమే ఆ జ్ఞానానికి అందులో కర్మ యోగం బహిరంగమైతే సమాధి అంతరంగం. ఇలాటి అంతరంగ సాధన మార్గంలో పరిశుద్ధులయి తద్వారా చివరకు జ్ఞానార్జన చేసి సిద్ధులయిన యోగులచరిత్రే మనమింత వరకూ నిరూపించాము. వీరి జీవితాలన్నీ ఆ యోగ స్వరూపాన్ని మనబోటి ముముక్షువులు గ్రహించటాని కుదాహరణాలు మాత్రమే నని భావించాలి మనం.
Page 251