కొని తెచ్చుకోనక్కరలేదు. అలా తెచ్చి పెట్టుకొన్నా ప్రాప్తం లేకపోతే అది బలాదూరయి పోతుంది. ప్రాప్తముంటే మన ప్రమేయం లేకుండా దానిపాటికదే మనకు ప్రాప్తిస్తుంది. ఇది నేను జుంటీగ వలనా అజగరం వలనా గ్రహించిన సత్యం. తేనెటీగ ఎంతో కష్టపడి మధువు చేకూరుస్తుంది. ఏమి ప్రయోజనం. పరుల పాలు చేసి ఊరక కూచుంటుంది. పోతే కొండ చిలువ జీవనార్థ మేమాత్రమూ పాటు పడదు. నోటి దగ్గరికి నడచి వస్తాయి జంతువులు. తిని హాయిగా పడి ఉంటుంది. ఇవి రెండే జీవితంలో నాకు గురువులు. వీటి అడుగుజాడల్లో నడుస్తుంటాను నేను. దానితో నిశ్చింతుడనైన నాకెలాటి ఒడుదుడుకులూ కానరావు. ఇన్ని మాటలెందుకు. ఒక్కమాట చెబుతాను వినమని ఇలా అంటాడు. "లేదని యెవ్వరి నడుగను రాదని చింతింపపరులు రప్పించినచో కాదని యావల ద్రోయను - భేదము మోదమును లేక క్రీడింతు మదిన్" ఒకటి లేదని రాదని బాధలేదు నాకు. అయితే ఒక సంగతి. ఎవడైనా ఇస్తే కాదని నిరాకరించను.
ఇదుగో ఇక్కడ ఉంది రహస్యమంతా. ఇది చూడబోతే యోగం కాదు. జ్ఞానం. పరిపూర్ణమైన అద్వైత జ్ఞానదృష్టికీ ప్రపంచమంతా బ్రహ్మమయమే. ఆత్మస్వరూపమే. అలాంటప్పుడిక భోగమేమిటి. త్యాగమేమిటి, రాగమేమిటి, ద్వేషమేమిటీ, హేయమేమిటి, ఉపాదేయమేమిటి. అంతా ఏకమే సమానమే. దేనినీ అవుననరాదు కాదనరాదు. నద్వేష్టి సంప్రవృత్తాని, ననివృత్తాని కాంక్షతి, అందుకే చెబుతున్నాడింకా అజగరుడు. “అజిన వల్కల దుకూలాంబరంబులు కట్టియైన కట్టకయైన నలరుచుందు - భర్మ శయ్యలనైన బర్ణ శిలాతృణ భస్మంబు లందైన పండుచుందు. "నిందింపబరుల నెన్నడు - వందింప ననేకపీడ వచ్చిన మది నాక్రందింప విభవముల కానందింప ప్రకామ వర్తనంబున నధిపా.” ఇలా ఏ కోరికా లేక ఒకప్పుడు దిగంబరుడయి పిశాచంలాగా తిరుగుతాడట. చాలా రోజు లొకప్పుడ డజగరం లాగా కళ్లు మూసుకొని పడి ఉంటాడట. అయితే ఎప్పుడెలా ఉంటున్నా ఏకాంత భావంతో విష్ణువు నందేమనసు లగ్నం చేసి వికల్పాల నన్నిటినీ భేద గ్రాహి చిత్తవృత్తులలో, చిత్తాన్ని అర్థ రూప విభ్రమం గల మనస్సులో, మనసు నహంకారంలో, అహంకారాన్ని మాయాశక్తిలో ఆ మాయా శక్తిని ఆత్మానుభవంలో లయం చేసి బహిరంతరాల్లో నిరంతరమూ సత్యాన్నే దర్శిస్తున్నానంటాడు. చూచారా ఈ వాక్యాలలో సమాధి
Page 250