ఇలాంటి వృత్తితో బ్రతికే మహాయోగి కూడా ఒక అజగరుడే. అలాంటి అజగర యోగిని దర్శించా డొకనాడు ప్రహ్లాదుడు. చూస్తే చాలా బలవంతుడిగా కనిపించాడు.
దగ్గరికి పోయి నమస్కరించి అయ్యా “బిభర్షికాయం పీవాసం - సోద్యమో భోగవాన్ యథా” చాలా దృఢమైన శరీరం ధరించి ఉన్నాడు “భోగినాంఖలు దేహోయంపీవా భవతి నాన్యథా" అనుభవపరులైన లోకులకు తప్ప ఇలాంటి పీవరమైన శరీరముండటానికి లేదు. “నతే శయానస్య నిరుద్యమస్య బ్రహ్మాన్ని హారోయత ఏవ భోగాః” నీవు నిరుద్యముడవూ, శయానుడవూ నీకు సుఖానుభవమెక్కడిది. అది లేకుంటే ఇంత దృఢమైన శరీర పాటవమెక్కడి నుండి వచ్చిందని ప్రశ్నిస్తాడు. ఇది ఒక నిమిత్త మాత్రమే ఈ ప్రశ్న. నిజానికి ప్రహ్లాదుడూ లేడు అజగరుడూ లేడు. అజగర చర్య ఎలాంటిదో ప్రహ్లాదుడికి తెలియనిదా. అయినా ప్రశ్నించాడంటే ఈ కథ ద్వారా మన మాపూర్ణయోగి జీవిత మెలాంటిదో లోకంలో జీవన్ముక్తుడైన వాడెలా జీవిస్తాడో తెలుసుకోటానికే. దానికొక ఉదాహరణ ప్రాయ మీ ఆఖ్యాయిక. అంతే కాదు. కేవల నివృత్తి రూపమైన సమాధి యోగమిది. కర్మయోగం లాంటిది గాదు సమాధి యోగం. అది ప్రవృత్తి రూపమైతే ఇది నివృత్తి రూపమని మొదటనే పేర్కొన్నాము. అయితే ఈ నివృత్తి భీష్మాదులలో ఋషభాదులలో అంత బాగా దాఖలా కాదు మనకు. నూటికి నూరుపాళ్లూ దాఖలా అయ్యేది అది మనకీ అజగర వృత్తాంతంలోనే. ఏ మాత్రమూ ప్రవృత్తి వాసన లేని నిత్యనివృత్తి స్వభావుడ అజగరుడు. సమాధి యోగంలోని ఈ అంశాన్ని బాగా నిరూపణ చేసి చూపటమే ఈ అజగర వృత్తాంతానికి తాత్పర్యం.
ప్రహ్లాదుడడిగిన ప్రశ్నకిలా సమాధానమిస్తాడా అజగరుడు. "సరఘల్ గూర్చిన తేనె మానవులకున్ సంప్రాప్తమైనట్లు- లోభరతుల్ కూర్చిన విత్తముల్ పరుల కుం బ్రాపించు - ప్రాప్తాశియై తిరుగంబోని మహోరగంబు బ్రదుకున్ దీర్ఘాంగమై యుండియున్ చిరకాలంబుగ వాని వర్తనమునే జింతించి యేకాంతినై" అజగరమును జుంటీగయు నిజ గురువులు గాగ దలచి నిశ్చింతుడనై - “విజనస్థలి కర్మంబుల గజిబిజి లేకున్న వాడ గౌరవ వృత్తిన్" అయ్యా నీకు తెలియని దేమున్నది. నీవు పరమార్థ వేదివైన ప్రహ్లాదుడవు గదా లోకహితం కోరి నన్నిలా ప్రశ్నిస్తున్నావు నీవు. పీవరత్వం శరీరానికి మనం సంపాదించి పెట్టనక్కరలేదు. భోగాలు మనం
Page 249