ఆహా ఎంత గొప్ప మాట సెలవిచ్చారు. ఇంకా బోధించమని రహూగణుడు
ప్రాధేయపడితే భరతుడాయనను చూచి రాజా! మన పాదాలీ భూమిమీద ఉన్నాయి.
పాదాల మీద జంఘలున్నాయి. జంఘల మీద జానువులు, జానువులపైన
ఊరువులున్నాయి. ఊరువుల మీద నడుమూ, నడుము మీద ఉరస్సూ
దాని
మీద కంఠం, దానిమీద మూపులూ ఉంటే ఆ మూపుల మీద ఉందొక దారుమయమైన
శిబిక. ఆ శిబికలో ఉన్న ఒక శరీరాన్ని చూచి రాజనే అభిమానంతో నీవు
బ్రతుకుతున్నావు. అంతేకాదు. “శోచ్యా నిమాన్ స్వాసతికష్ట దీనాన్ విష్ట్యా నిగృష్ణ
న్నిరనుగ్రహోసి” నీ పల్లకి మోసే ఈ బోయీలు నీకంటె తక్కువని భావించి వారికి
కూలినిచ్చి సాకుతున్నాను గదా అని అహంభావంతో మెలగుతున్నావు. ఈ ఎక్కువ
తక్కువలన్నీ అవిద్యా కల్పితమని తెలియదు నీకు “జ్ఞానమ్ విశుద్ధం పరమార్ధ మేకం
అనంతరం త్వబహిర్ర్బహ్మ సత్యమ్" సమస్త భూతజాలం లోపలా వెలపలా నిండి
నిబిడమై యున్న దొకే ఒక బ్రహ్మమదే పరమసత్యం. తక్కినదంతా దాని ఆభాసేనని
గుర్తించు. అదే సమ్యగ్దర్శనం. ఇంతకన్నా నేను నీకు బోధించవలసింది నీవు సాధించ
వలసింది మరొకటి ఏదీ లేదని మౌనం వహిస్తాడు. రహూగణుడా ఉపదేశ ప్రభావం
చేత పవిత్రీ కృతాంతః కరుణడయి ఆయన చరణాలకు వందనం చేసి వెళ్లిపోతాడు.
భరతుడు కూడ పరిపూర్ణ జ్ఞానార్ణవుడు కాబట్టి స్వైర విహార శీలుడయి కాలమాసన్నం
కాగానే భౌతికమైన ఈ కాయాన్ని విడిచి అభౌతికమైన జ్ఞానకాయం ధరిస్తాడు.
ఇదీ జడ భరతుడి చరిత్ర. కర్మయోగంతో ప్రారంభమైన జీవితం తుదకు సమాధి భక్తియోగాల ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని సాధించి మోక్ష సామ్రాజ్యానికే పట్టం కట్టుకొంటుంది. ఇలాటి యాదృచ్ఛిక నిరాడంబర సుందరమైన అవధూత చర్య ఎలాంటిదో ముక్తసరిగా వర్ణించిన సన్నివేశం మరొకటుంది భాగవతంలో. అది దీని తరువాతనే వస్తుంది. ప్రహ్లాదా జగర సంవాదమని దాని పేరు. అజగరమంటే కొండ చిలువ అని అర్థం. అయితే ఇక్కడ వచ్చేది కొండచిలువ గాదు. కొండచిలువ లాంటి వ్యవహారంగల మానవుడు. అజగరం ఒకచోట కదలక మెదలక పడి ఉంటుంది. ఏకాంతంగా బ్రతుకుతుంటుంది. ఎక్కడకోపోయి ఏదో సంపాదించాలనే కోరిక లేదు దానికి. తుదకు ఆహారానికి కూడా తాపత్రయ పడదది. దానినోటి దగ్గరి కేది వస్తే అదే దాని కాహారం.
Page 248