#


Index

సమాధియోగులు - భీష్మాదులు

లేదు. మీ మహత్త్వం దెలియక ఏవేవో ప్రేలాపనలు చేశాను. నా అపరాధం క్షమించి నాకు తత్త్వోపదేశం చేయమని ప్రార్ధిస్తాడు.

  ఆ తరువాత రహూగణుడికీ భరతుడికీ చాలా దీర్ఘమైన సంవాదం జరుగుతుంది. అందులో ఎన్నెన్ని ధర్మ సూక్ష్మాలు దొర్లుతాయో చెప్పలేము. అమూల్యమైన వన్నీ. విష్ణు పురాణంలో కూడా ఉంది ఈ వృత్తాంతం. అందులో కూడా ఎన్నో విశేషాలు కనిపిస్తాయి మనకు. అవన్నీ ఉదాహరిస్తు పోతే గ్రంథం విస్తరిస్తుందని భాగవత గ్రంథాన్నే అనుసరించి వ్రాస్తున్నాను. "అకోవిదః కోవిద వాద వాదాన్ వదస్యథో నాతి విదాం వరిష్ఠః నసూర యోహి వ్యవహార మేవమ్ తత్త్వావ మర్శేన సహా మనంతి" అని అర్జునుణ్ణి కృష్ణుడిలాగా ఆదిలోనే మందలిస్తాడు. నవేదవా దేషుహి తత్త్వ వాదః వాదాలలో లేదు తత్త్వజ్ఞానం. "నతత్యుతత్త్వ గ్రహణాయ సాక్షాద్వర్షయ సీరపివాచ స్సమీసన్-స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యమ్ - నయస్య హేయా నుమితం స్వయం స్యాత్" స్వప్నంలో ఒక ఆకృతి కనిపించి అంతలోనే మాయమైనట్టుగా వేదాంత వాక్యాలు కూడా మనకు తత్త్వాన్ని దూరదూరంగానేచూపి అంతర్ధాన మవుతాయి. "గుణాను రక్తం వ్యసనాయజంతోః క్షేమాయ నైర్గుణ్య మథోమనస్స్యాత్” అన్ని వ్యసనాలకూ గుణసంగమే మూలం. క్షేమమే కావాలంటే మనసు సదా నిర్గుణమయి ఉండాలి. ఏతా మనసో విభూతీర్జీవస్య మాయా రచితస్య నిత్యాః ఇంద్రియ గుణాలూ, వాటి వృత్తులూ, ఇవన్నీ మనో విభూతులే. ఇవి జీవుడికి నిత్యంగా భాసిస్తాయి. అసలీ జీవుడే నిత్యుడు కాడు. భగవన్మాయా కల్పితుడీ జీవుడు. “నారాయణో భగవాన్ వాసుదేవః స్వమా యయా త్యన్యవసీయ మానః యథానిలః స్థావర జంగమానా - మాత్మ స్వరూపేణ నివిష్ట ఈశేత్” భగవానుడైన వాసుదేవుడే ప్రాణవాయువులాగా ఈ శరీరంలో జీవరూపంగా ప్రవేశించి వ్యవహరిస్తున్నాడు. "నయావ దేతాం తనుభృన్నరేంద్ర - విధూయ మాయామ్ వయునోదయేన విముక్త సంగోజిత షట్సపత్నో వేదాత్మ తత్త్వం భ్రమతీహ తావత్” ఎంతవరకీ దేహధారి అయిన జీవుడాత్మ జ్ఞాన సూర్యోదయంతో ఈ మాయాంధకారాన్ని పారదోలడో అంతవరకూ ఈ ప్రకృతి గుణసంగమూ, అరిషడ్వర్గ ప్రభావమూ తొలగదు. కాబట్టి తత్త్వజ్ఞానానికి నోచుకోడు. నోచుకోలేక తలతిక్కపట్టిన వాడిలాగా ఈ సంసార మహారణ్యంలో పరిభ్రమిస్తుంటాడు.

Page 247

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు