ఆ దారి వెంట బోతుంటాడు. పల్లకీ బోయీలు మోయటానికి కొంత బద్ధకించి దూరాన నిశ్చలంగా కూచుని ఉన్న ఈ భరతుణ్ణి చూచి బలంగా ఉన్నాడీతని చేత కొంత సేపు మోయిద్దామని దగ్గరికి పిలిచి అతనిమీద పల్లకి బొంగు మోపుతారు. అతడు నడుస్తుంటే అలవాటు లేదు గనుక అక్కడక్కడ అడుగులు తప్పబడుతుంటాయి. దానితో కొంచెమారాజు కతల కుతల మనిపించి ఎందుకిలా జరుగుతున్నదని బెస్తలనడుగుతాడు. అయ్యా మాదిగాదీ తప్పు - ఇదుగో ఈ కొత్తవాడి మూలంగా జరుగుతోందని చెబుతారు. అది విని ఆ రాజు హేళనగా ఏమయ్యా "అలసితి వెంతయున్ ముసలి - వాకట డస్సితి - వవెన్ను మిక్కిలిం బలుచన యున్న దీశిబిక భారము - దూరము మోసితే గతిన్ నిలిచెద వని” తూలనాడతాడు. దానికేమాత్రమూ చలించక ఆ మానవుడలాగే మోస్తూ పోతాడు. మరీ కుదుపు ఎక్కువయ్యే సరి కారాజు కోపం పట్టజాలక “ఓరీ జీవన్మృతుడా నా యాజ్ఞ దప్పించి నడుస్తావా ఈ వక్రమార్గం విడిపించి నిన్ను సన్మార్గాన నడిపిస్తాను చూడ”మని ఉపలంభిస్తాడు. దాని కేమాత్రమే చిత్త వికృతి లేని వాడయి భరతుడు చాలా నింపాదిగా నరేంద్రా నీవు చెప్పినది సత్యంబు - భారంబీ శరీరంబునకే గాని నాకుం గలుగనేరదు. ఐనను స్టౌల్య కార్శ్యంబులు - వ్యాధులు - నాధులు క్షుత్తృష్ణలు జరామరణంబులు - అహంకారంబులు దేహంబు తోడన జనియించుం గాని నాకుం గలుగనేరవు. జీవన్మృతుండనేన కాదది యందరి యందును గలిగి యుండు. స్వామి భృత్య సంబంధంబులు విధి కృతంబులగచు - వ్యవహారంబులం జేసి శరీరంబులకు గలుగుంగాని జీవునికి లేక యుండు నని అతని మాటలకు వాతపెట్టినట్టు సమాధానమిస్తాడు. దానికి మెఱుగు పెట్టినట్టు ఇంకా ఇలా చీవాట్లు పెడతాడా రాజును. నీవు నన్నాజ్ఞాపిస్తా నంటున్నావు. అది నీపూర్వ స్వభావానికి తగినట్టే ఉందామాట. ఉన్మత్త జడ స్వభావుడైన నా విషయంలోని శిక్ష ఏమి పని చేయగలదది నిరుపయోగమే సుమా.
ఇంత నిగూఢార్ధంగా మాటాడిన ఈ మాటలు చెవిన బడే సరికా రాజితడెవడో మహాపురుషి డితనికి తీరని అపచారం చేశానని పశ్చాత్తాపంతో శిబిక దిగి పాదాల మీద వాలుతాడు. అయ్యా నా తప్పు మన్నించండి. మీరెవరో మహాపురుషులు. బహుశా నేను వెతుకుతూ పోయే ఆ కపిల మహర్షివే అయి ఉంటావు. సందేహం
Page 246