గాని ఎందుకెదురు చెబుతాడు. ఎందుకెడముగం పెడతాడు. సర్వమూ భగవత్స్వరూపంగా దర్శించే యోగికేదైనా ఒక్కటే. “సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌజయాజయౌ” “యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః అన్న శాస్త్ర వాక్యాని” కుదాహరణ ప్రాయంగానే నడుస్తుందలాంటి వారి జీవితం.
అలాగే జీవితం సాగిస్తూ పొలానికి కావలి ఉంటున్నాడా మహాత్ముడు. ఇలా
ఉంటుండగా ఒకనాడు వృషలపతి ఒకడు సంతానం లేక భద్రకాళి కొక పురుష
పశువును బలి ఇవ్వాలని భటులచేత పట్టించుకొనిపోగా దైవికంగా ఆ పశువు
దేవళం నుంచి తప్పించుకొని పాఱిపోతుంది. దాన్ని తరుముకొంటూ పోయి భటులా
రాత్రి కటికి చీకటిలో అది ఎక్కడా కనిపించక దూరాన పొలంలో వీరాసనం వేసుకొని
నిశ్చల సమాధి స్థితిలో కూచొని ఉన్న జడ భరతుణ్ణి చూచి బాగా దృఢంగా
కనిపిస్తున్నాడు వీడయితే సరిపోతాడని చెప్పి మోసుకొని పోయారు. అక్కడ
అభ్యంజనాదులు చేయించి నూతన వస్త్రాలు ధరింపజేసి అలంకరించి మృష్టాన్నాలు
పెట్టి భద్రకాళి కెదురుగా నిలుపుతారు. తరువాత ఆ శూద్ర సామంతు డభిమంత్రించిన
ఖడ్గాన్ని పయికెత్తి కాళికా ప్రీత్యర్థ మాయన శిరస్సు ఛేదించటాని కుద్యమించాడో
లేదో. ఇంతలోనే "బ్రహ్మ తేజసా అతి దుర్విషహేణ దందహ్య మానేన వపుషా
సహసోచ్చచాల సైవ దేవీ భద్రకాళీ” అతి దుస్సహమైన అతని బ్రహ్మ తేజస్సు
తననే దహించి వేస్తున్నట్టు కాగా కదలిపోయిందా భద్రకాళి. వెంటనే అమర్ష రోషావేశ
రభస విలసిత భ్రూకుటీ విటపకుటిల దంష్టారు ణేక్షణాటో పాతిభయానక వదనంతో
మహాట్టహాసం చేస్తూ ఆ ఖడ్గం వాడి చేతిలో నుంచి లాగుకొని వాడినీ వాడి పరివారాన్నీ
ఒక్క పెట్టున ఛిన్నాభిన్నం చేసి అంతర్ధానమవుతుంది. మరి మన భరతుడి పరిస్థితి
ఎలా ఉందప్పుడు. “అచ్చట విప్రసూనుడు భయం బొకయించుక లేక – చంపగా
వచ్చిన వారి యందు - కరవాలమునందును -కాళియందు తా-నచ్యుత” భావముంచి
చూస్తున్నాడట. అలాంటి సమదృష్టి ఉన్న వాడికిక మృత్యు భయమేముంది. మృత్యువు
కూడ వాడిపాలిటి కమృత్యువే.
మరలా వచ్చి యథా ప్రకారంగా పొలం మీద కూచున్నాడు. మరికొన్ని రోజుల కింకొక విశేషం జరిగింది. రహూగణడనే రాజుఏవో కొన్ని ఆధ్యాత్మ విద్యా రహస్యాలడిగి తెలుసుకొందామని పల్లకి ఎక్కి కపిలుడనే మహర్షి వద్దకు బయలుదేరి
Page 245