#


Index

సమాధియోగులు - భీష్మాదులు

భావించి వాటినన్నిటినీ పరిత్యజించి వచ్చిన విరక్తుడిప్పుడీ హరిణ మాయలో బడి రక్తుడయినాడు. ఎంతవారికి కూడా ప్రకృతి గుణ సంపర్క ప్రభావం తప్పదనేందుకిదే నిదర్శనం.

  చూస్తూ చూస్తుండగానే కాలం సమీపించింది భరతుడికి. అప్పుడు కూడా చిత్రమేమంటే ఆ హరిణ పోతాన్నే మనసులో స్మరిస్తూ ప్రాణాలు విడుస్తాడు. బహుకాలాభ్యస్తమైన హరి స్మరణ ఏమయిందో దానికి మారుగా హరిణ స్మరణే మిగిలింది చివరకు. యథా మతిస్తథా గతిః అన్నారు. దానికి తగినట్టు భరతుడు మరుజన్మలో హరిణంగా జన్మిస్తాడు. భగవానుడే చెప్పాడు గదా. "యం యం వాపి స్మరన్ భావం - త్యజత్యంతే కళేబరం, తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః" తద్భావ భావమనమని ఒకటుంది మానవులకు. ఒకటి తీవ్రంగా భావిస్తూ పోతే దానితో తాదాత్మ్యం చెందటం. అంటే అదే అయిపోతాడని భావం. ఇలాంటి తాదాత్మ్య బుద్ధి దేనితో ఉంటే అదే. అది జీవితాంతమూ బయటపడదు. ఇక జీవిత మాఖరయ్యే క్షణంలో ఏది బలంగా మనసులో నిలుస్తుందో ఆ తరువాత జన్మలో ఆ రూపమే సంప్రాప్తమవుతుందట అయితే ఇక్కడ ఒకప్రశ్న. అభ్యాస బలంతో గదా ఏదైనా వస్తుందన్నారు. అభ్యాసం మొదటి నుంచీ భరతుడికి హరిస్మరణమే గదా. ఎప్పుడో మధ్యలో సంక్రమించింది గదా ఈ హరిణ వృత్తాంతం. మరి చిరాభ్యస్తమైన విష్ణు స్మరణ రాకుండా హరిణ భావన ఎలా వచ్చిందాయనకు. వాస్తవమే. చిరాభ్యస్తమైనది విష్ణు స్మరణమే సందేహం లేదు. అయినా అంత్యక్షణంలో అది నిలవాలి గదా మనసులో. దానికి బదులుగా హరిణమూర్తే నిలిచింది. అంత్య క్షణంలో నిలిచిందేదో దాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది భావి జన్మ. అంతేకాని చిరాభ్యస్తమూ, అనభ్యస్తమూ అని కాదు. చిరాభ్యాసమైనా దానికి ఫలం లేకపోవచ్చు. అచిరాభ్యస్తమైన దీనికి దానికన్నా బలం ఉండవచ్చు. అయితే అది ఇక బూడిదలో బోసిన పన్నీరేనా కాదు. ఎక్కడికీ పోదది. సమయం వచ్చేదాకా వేచి ఉంటుంది. దేశ కాల నిమిత్తాదు లొనగూడిన నాటికది కూడా మనం చెప్పకుండానే ఫలితమిస్తుంది. ఇది తరువాత ఇంద్ర్యుమ్నుడి వృత్తాంతంలో సవిస్తరంగా మనవి చేస్తాను.

  కాగా ప్రస్తుత మీ భరతుడెంత భాగవతుడైనా అవసానంలో దాని సంస్కారం పైకి రాలేదు. దాని బదులు తాత్కాలికమే అయినా వెంటనే పైకి వచ్చిన భావం ఆ

Page 242

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు