- హదతేస్య తస్య హాయం పురీష సురభి సౌగంధ్యో వాయుర్దిశో దశ యోజనం సమంతాత్ సురభీచకార” అజగర వ్రతాన్ని అనుసరిస్తూ ఎక్కడ బడితే అక్కడ పడుకొనేవాడు. తాగేవాడు తినేవాడు, మూత్రించేవాడు, పురీషం విసర్జించేవాడు. దానిసౌగంధ్యంతో సురఖిళమైన వాయువు దశ దిశలూ వీస్తే ఎటు చూచినా ఒక ఆమడదూరం పరిమళం వెదజల్లుతూ వచ్చేది. “ఇతి నానాయోగ చర్యాచరణో భగవాన్, సిద్ధ సమస్తార్థ పరిపూర్ణ యోగైశ్వర్యాణి" ఇలా అనేక విధాలైన యోగచర్యలు చరిస్తూ సమస్త యోగసిద్ధులనూ సాధించాడు. ఏమిటా సిద్ధులు. "వైహాయన, మనోజవ, అంతర్ధాన, పరకాయ ప్రవేశ, దూరగ్రహణ శ్రవణా దీని" ఆకాశ గమనమూ, మనోవేగమూ, తిరస్కరిణి, పరకాయ ప్రవేశమూ, దూదర్శన శ్రవణాదులూ.
శుకమహర్షి ఇలా వర్ణిస్తూ పోయేసరికి పరీక్షిత్తు కొక ప్రశ్న ఉదయించింది. అయ్యా మీరీ యోగశక్తులన్నీ ఇలా బ్రహ్మాండంగా వర్ణించి చెబుతున్నారు. బాగానే ఉంది. కాని కర్మవాసనలన్నీ జ్ఞానాగ్ని చేత దగ్ధం చేసుకొన్న యోగికీ మహిమలన్నీ మరలా మోక్షమార్గంలో ప్రతిబంధమే గదా. అనగానే శుకుడు "సత్య ముక్తమ్ కింత్వి హవా ఏకేతు మనసో విస్రంభ మనవ స్థానస్య శఠ కిరాత ఇవ నసంగచ్ఛంతే” అని సమాధానమిస్తాడు. దీని అర్థమేమంటే మనసనేది అనవస్థానం. అంటే అతిచంచలమైనది. దానిని చస్తే నమ్మరాదు. మనకు వశమయినట్టే అయి మరలా కొడి ఎత్తుతుంది. అంచేత ఒక తెలివిగల కిరాతుడు తాను పడగొట్టిన మృగం మృతమైనా ఎలా విశ్వసించడో, అలాగే మనసు మృతమైనదన్నా నమ్మలేడు యోగి. కనుకనే ఇలాంటి మహిమల వల్ల దాని నిదర్శనం చేసుకొంటాడు. కనుకనే ఇలాంటి మహిమలు చూపటమే జీవితానికి పరాయణమని భావించడు. ప్రస్తుతం ఋషభుడు కూడా ఎన్ని సిద్ధులు ప్రదర్శించినా అది ప్రదర్శనా దృష్టితో గాక మనోనిగ్రహం కోసమే అనుసరిస్తూ వచ్చాడు. అనుసరిస్తూ ఒకానొక సమయానికి ప్రారబ్ద కర్మ పరిపక్వం కాగా సమీరవేగ ధూతవేణు వికల జాతోగ్ర దావానల మాయన ప్రవేశించిన వనంతో పాటు ఆ మహాత్ముని కూడా దహించి వేస్తుంది. దానితో అయత్నంగానే ఈ పాంచ భౌతిక శరీరాన్ని పరిత్యజించి ఋషభుడు బ్రహ్మభూయాన్ని పొందుతాడు. ఇదీ ఋషభుడి యోగచర్చ.
Page 240