#


Index

సమాధియోగులు - భీష్మాదులు

- సచ్ఛద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వ - దసంప్ర మాదేన యమేన వాచాం, కర్మాశయం, హృదయ గ్రంథిబంధ, మవిద్యయాసాదిత మప్రమత్తః అనేన యోగేన యథోపదేశమ్ సమ్యగ్వ్యపో హ్యో పరమేత యోగాత్” వివిక్త సేవా అధ్యాత్మ యోగమూ, ఇంద్రియ ప్రాణమనో నిగ్రహమూ, శ్రద్ధా బ్రహ్మచర్య యమ నియమాదులూ, వీటన్నిటి మూలంగా అవిద్యా గ్రంథి విసంసనం చేసుకొని సమాధి బలంతో లింగ దేహ భంగమెవడు చేసుకొని నష్క్రమిస్తాడో వాడే సాయుజ్య సామ్రాజ్యాని కర్హుడు. “తస్మాద్భవంతో హృదయేన జాతా స్సర్వే మహీయాంస మముం సనాభిం - అక్లిష్ట బుద్ధ్యా భరతం భజధ్వం" అంచేత మీరంతా నా హృదయ జాతులయి నందు కకలుషిత బుద్ధులయి సకల గుణ సంపన్నుడైన మీ అగ్రజాతుడీ భరతుణ్ణి సేవించండి అని సలహా ఇచ్చి భరతుడికి పట్టాభిషేకం చేసి కొంతకాలం రాజగృహంలోనే యోగ నిష్ఠుడయి నివసిస్తాడు.

  ఆ తరువాత అవతార పురుషుడు కాబట్టి యోగప్రభావాన్ని లోకులందరికీ తన ఆచరణలోనే చాటి చూపటాని కవధూత చర్య ననుసరిస్తూ లోకంలో సంచరిస్తాడు. అది ఎలాగంటే భాగవతం మనకిలా వర్ణించి చెబుతున్నది. "జడాంధ బధిర మూక పిశాచో న్మాద ఇవ అవధూత వేషః అభి భాష్య మాణోపి జనానాం గృహీత మౌన వ్రతః తూప్లీం బభూవ” ఒక జడుడు అంధుడు బధిరుడు ఉన్మత్తుడి మాదిరి నగ్నంగా తిరుగుతూ ఎవరెప్పుడు పలకరించినా వారితో ఏమీ మాటాడకమౌనంగా ఉండేవాడు. “తత్ర తత్రపుర గ్రామాకర ఖేట వాట శిబిర ప్రజ ఘోషసార్థ గిరివనా శ్రమాదిషు అను పథమవని చరాపశదైః పరిభూయమానో మక్షి కాదిభి 8వ వనగజః తర్జన తాడనమే హనష్ఠీవన, గ్రావ శకృద్రజః ప్రక్షేపణ, పూతివాత దురుకై, స్తదవి గణయన్నే వాసత్సం స్థానః ఏతస్మిన్ దేహో పలక్షణే సదుపదేశే, ఉభయానుభవ స్వరూపేణ స్వమహిమావస్థానేన అసమా రోపితా హం మమా భిమానత్వా, దఖండిత మనాః పృథివీ మేక చరః పరిబభ్రామ” పట్టణ గ్రామపర్వతా రణ్యాదులలో ఎక్కడ ఎవరివల్ల ఎలాంటి మానావమానాలు కలుగుతున్నా ఒక మదగజం లాగా లెక్క చేయక దేహాభిమానాన్ని పూర్తిగా వదిలేసి సుఖదుఃఖాదులు సమానంగా తీసుకొంటూ నిర్వికారమైన చిత్తంతో సంచరించేవాడు. అంతేకాదు. "వ్రత మజగర మాస్థితశ్శయాన ఏవాశ్నాతి - పిబతి ఖాద - త్యథమేహతి

Page 239

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు