ఋషభుడు సాక్షాత్తూ విష్ణ్వంశ సంభూతుడు. పృథుచక్రవర్తి లాగా ఇతడు కూడా ఆయనగారి అపరావతారమే. అది కూడా చాలా చమత్కారంగా జరిగింది. నాభి ఋత్విక్కుల సహాయంతో నారాయణుని గూర్చి ఒక బ్రహ్మాండమైన యజ్ఞం చేస్తాడు. యజ్ఞపురుషుడైన నారాయణుడు ప్రత్యక్షమై మీరు నాయీడు గల కుమారుని అడిగారు కాబట్టి నాకు సమానుడైన వాడను నేనే కాబట్టి మీకు నేనే నందనుడనయి జన్మిస్తున్నానని అనుగ్రహిస్తాడు. అదే ఋషభావతారం. నాభికిమేరు దేవియందు జన్మించాడు. పుట్టీ పుట్టగానే ఆ బిడ్డనొక మహారాజుగా గుర్తించారు ప్రజలంతా. క్రమంగా ఆయన ప్రభావం భూమండలమంతా ప్రాకసాగింది. అది చూచి మత్సర గ్రస్తుడయ్యాడు మహేంద్రుడు. అతడు పాలించే దేశాని కనా వృష్టి పీడ నావహించాడు. ఋషభదేవుడు దాన్ని తన యోగమాయా బలంతో జయిస్తాడట.
పుత్రుని దివ్య ప్రభావం గమనించి అజనాభమనే ఈ వర్షానికంతటికీ ఆయననే పట్టాభిషిక్తుణ్ణి చేసి పత్నీసహితుడై బదరి కాశ్రమానికి పోయి మహా యోగసమాధితో శరీర త్యాగం చేసి హరి సాయుజ్యం చెందుతాడు. ఆ తరువాత ఋషభుడు తాను పాలించే భూమి కర్మ భూమి అనిగ్రహించి ప్రజలందరూ తనతో సహా కర్మ తంత్రులయి ప్రవర్తించే లాగా చూస్తాడు. అతని ధర్మబుద్ధికి సంతసించి దేవేంద్రుడు జయంతి అనే కన్యనిస్తే వివాహమాడి భరతాదులైన కుమారులను నూరుగురు నుత్పాదిస్తాడు. ఆ భరతుడే జడభరతుడు. అతని పేర వెలసిందే ఈ భరత వర్షం. భారతదేశం. అంతకు ముందిది అజనాభమే. భారతమనే పేరు దుష్యంతుని కుమారుడైన భరతుని మీదుగా ఏర్పడిందని చాలా మంది అభిప్రాయం. అది వట్టి అపోహ. భారతదేశ ప్రవర్తకుడు జడ భరతుడే. అతడు ఋషభుని జ్యేష్ఠ పుత్రుడు.
ఋషభుడు బహుకాల మీ దేశాన్ని ఏలుతూ ఎన్నో క్రతువులూ, యజ్ఞాలూ అనుష్ఠించి చివర కొకనాడు తన నూరుగురు కుమారులను చేర బిలిచి వారికిలా శిక్షణ ఇస్తాడు. “నాయం దేహో దేహ భాజాం నృలోకే కామానర్హతి విడ్భుజాంయే తపోదివ్యం పుత్రకా యేవసత్త్వం - శుద్ధ్యేద్య స్మాద్బహ్మ సుఖం హ్యనంతమ్” దేహం శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతమైన బ్రహ్మపదం కావాలంటే తపస్సు ఒక్కటే శరణ్యం మానవులకు. దానివల్ల సత్త్వం శుద్ధి అయితే బ్రహ్మపదం సులభంగా లభిస్తుంది. "అధ్యాత్మ యోగేన వివిక్త సేవయా- ప్రాణేంద్రియాత్మాభి జయేన సధ్ర్యక్
Page 238