గావించుట హృషీకేశాను వర్తులయిన సాధువులకు దగదు జగదుత్పత్తి స్థితి లయంబులకు దైవంబు కారణంబైయుండ నీ ధన దానుచరులు భవదీయ భ్రాతృ హంతలగుదురే అది గానరోషమడపు మహాత్మా. అర్థవిభునకు నీవపరాధి వయితివి. నతినుతులచేత నతనిని ప్రసన్నుని చేసుకొమ్మని" మందలించి పోతాడు. వెంటనే కుబేరుడు ప్రత్యక్షమవుతాడు. “నాయనా ప్రతి ఒక్కటీ కాలాధీనం. అది పరమాత్మ లీల. నీ సోదరుని చంపిన వారీ యక్షులుగారు. యక్షుల వధించినవాడవు నీవు గావు. ఈ సూక్ష్మం తెలుసుకొంటే ఇలాంటి పనులిక ఎప్పుడూ చేయవని” చెప్పి అతడడిగితే శ్రీహరి స్మరణ రహస్య ముపదేశించి తిరోహితుడవుతాడు.
తరువాత ధ్రువుడు పరిశుద్ధ మనస్కుడయి పట్టణానికి అప్పటి నుంచి హరి భక్తి నేమఱక తనయందు అఖిల ప్రపంచమందు ఒకే ఒక పరతత్వాన్ని దర్శిస్తూ శమదమాన్వితుడై ఇరువది యైదు వేల యేండ్లు భోగముల చేత పుణ్యక్షయమూ, అభోగముల చేత పాపక్షయమూ చేసుకొని చివరకు కొడుకులకు పట్టంగట్టి దేహాదికమైన సమస్త ప్రపంచమూ అవిద్యా రచిత స్వప్న గంధర్వనగరం లాగ భగవన్మాయా రచితమని గ్రహిస్తాడు. తరువాత అరణ్య భూములలో అసహాయుడై సంచరిస్తూ సునంద నందులనే బ్రహ్మవేత్తల సాంగత్యం కలిగి వారివల్ల హరి భక్తి రహస్యమంతా ఆకళించుకొని దివ్య విమానారూఢుడయి విష్ణు దత్తమైన ఆత్మస్థానాన్ని పోయి అలంకరిస్తాడు. ఇలా చివరదాకా సమాధియోగంతోనే కాలం గడుపుతూ వచ్చి దానితో పాటు చివరకు భక్తి యోగం కూడా ఒంటబట్టి ఆ రెండింటి బలంతో పరమ భాగవతుడయి ధ్రువుడు తనజీవితం చరితార్ధం చేసుకొంటాడు.
ధ్రువాదుల తరువాత చెప్పుకోదగింది ఋషభాది యోగుల చరిత్ర. సమాధి యోగమార్గంలో వీరిది పరాకాష్ఠ. మంత్ర తారకలయ హఠాది యోగాలన్నీ అహ మహమికతో వచ్చి దాసోహమన్న మహాపురుషులు వారు. ఈ ఋషుడు డెవరోగాదు. నాభికుమారుడు. నాభి ఆగ్నీధ్రుని తొమ్మిది మంది కుమారులలో ఒకడు. ఈ ఆగ్నీధ్రుడు ప్రియవ్రతుని కుమారుడు. ఆ ప్రియవ్రతుడవెరో గాదు. సాక్షాత్తూ ధ్రువుని తండ్రి ఆ ప్రియవ్రతుడు క్రూడా యోగమార్గ విశారదుడే. పరమభాగవతుడూ ఆత్మారాముడని పేరు గన్నవాడు. ఆయన కుమారుడు ఆగ్నీధ్రుడూ మనవడు నాభి కూడ తన్మార్గానుయాయులే. అప్పటికి ధ్రువుని వంశమంతా సమాధి నిష్ఠమైనదే నని అర్థమవుతున్నది. పోతే ఈ వంశీయులందరిలో తలమానికమైన వాడు ఋషభదేవుడు
Page 237