#


Index

సమాధియోగులు - భీష్మాదులు

  ఆ తరువాత విదురుడు మైత్రేయ మహర్షిని కలుసుకొని వారిరువురూ చేసిన సంవాదమంతా ఇంతా కాదు. మొత్తం తృతీయ చతుర్థ స్కంధాలు రెండూ విదుర మైత్రేయ సంవాదమే. అందులో ఎన్ని విషయాలెన్ని, రహస్యాలు, ఎన్ని వృత్తాంతాలు. కపిలుడు దేవహూతికి చేసిన బోధ, దక్షప్రజాపతి చరిత్ర, ధువోపాఖ్యానం, పృథు చక్రవర్తి చరిత్ర, పురంజనోపాఖ్యానం ఇలాంటి గొప్ప గొప్ప ఘట్టాలెన్నో వస్తాయిందులో. ప్రతి ఒక్కటీ విదురుడు ప్రశ్నించటమూ మైత్రేయుడు ప్రవచించటమూ. మొత్తానికి కర్మభక్తి సమాధి జ్ఞానాలనే నాలుగింటినీ ఆయా పాత్రల మీదా వారి చరిత్రల మీదా నెపం పెట్టి మైత్రేయు డేకరువు పెడతాడు. విదురుడన్ని రహస్యాలూ ఏక చిత్తంతో ఆలకిస్తాడు. అయితే వచ్చిన చిత్రమేమంటే అన్ని గొప్ప విషయాలు శ్రవణం చేసిన ఆ మహాత్ముడు మరలా ఆయనను వీడ్కొని బంధు సందర్శనాభిలాషియై హస్తినకు బయలుదేరుతాడట. ఎవరున్నారని అక్కడ. ఉన్నా తనకెవరేమి ఒరిగిస్తారని. కృష్ణునిలాంటి అవతార పురుషుడే నిష్క్రమించిన వార్త విన్నాడు తాను. విని నిర్వేదంతో వచ్చి మైత్రేయుణ్ణి దర్శించినవాడు. ఆయన వల్ల ఒకటి గాదు. రెండు గాదు. సవాలక్ష జీవిత రహస్యాలు తెలుసుకొన్నాడు. ఇన్ని తెలుసుకొన్నా ఇంకా బంధు వాత్సల్యమనే చాపల్యం వదలలేదా వ్యక్తికి. ఇదే వాసన అంటే. ఈ వాసన ప్రాబల్యం పని చేస్తున్నంత వరకూ ఎన్ని విను, ఎన్ని చేయి, మనిషి దారికి రాడు. అవి బావిలో పూడులాంటివి. పయినీళ్లు వృత్తులైతే లోపలి పూడు వాసనలు. వృత్తులు శ్రవణాదుల చేత తాత్కాలికంగా నశించినా సంస్కారాలు నశించవు. పయినీళ్లు తోడి పోసినా లోపలి పూడు తీయనంత వరకూ ఫలమేముంది. శుద్ధమైన గంగపైకి పొంగదు.

  అలాగే విదురుడెంత జ్ఞాని అయినా ఎంత యాత్రా శీలి అయినా ఎందరెందరు మహాత్ముల సందర్శనం చేసినా ఎన్ని తత్త్వ రహస్యాలు గ్రహించినా వాటి పరిపాకమైన శమదమాదు లబ్బలేదు. కనుకనే అంతా విని మరలా హస్తినకే దారి తీస్తాడు. ఆ తరువాత విదురుడెక్కడికి వెళ్లాడో ఏమయ్యాడో మనకు తెలియదు. భాగవత కర్త అది మన ఊహకే వదలి వేశాడు. బహుశః ఒక్కటే జరిగి ఉంటుంది. సందేహం లేదు. హస్తినకు వచ్చి పాండవుల మహాప్రస్థాన వార్త కూడా విని తన పామరత్వానికి తానే సిగ్గుపడి ఏపర్వత గుహలకో ఏ మహారణ్యాలకో పోయి అక్కడ ఏకాంతంగా ఒక అవధూత రూపంతో సంచరిస్తూ తన మనసుకు పట్టిన వాసనామయ మహా

Page 232

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు