చేరినవే. ఉత్తరాయణం, 'ఏకయా యాత్యనా వృత్తిమ్' అనే గీతా వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఉత్తరాయణంలో ప్రాణోత్కమణ చెందితే అర్చిరాది మార్గంలో దేవయానం చేసి దేవతా సాయుజ్యం పొందుతాడు యోగి. అలాగే చేశాడు భీష్ముడు.
ధర్మా స్రవదతస్త స్య సకాలః ప్రత్యుపస్థితః యో యోగినశ్ఛంద మృత్యో ర్వాంఛితస్తూత్తరాయణః
యోగులందరూ స్వచ్ఛంద మరణులే అసలు. భీష్ముడు కూడా స్వచ్ఛంద మరణుడయ్యాడంటే యోగి గనుకనే. అలాంటి యోగులు మరణించటానికి దేశకాలాది నియమాలున్నాయి. అలాటి నియమమే పాటించాడు భీష్ముడు.
అంతేగాదు. ఉత్రమణ చెందటం కూడా ధారణా ధ్యానాదులతోనే చెందటం కనిపిస్తుంది మనకు.
విశుద్ధయా ధారణయా హతాశుభః తదీక్షయైవాశు గతాయుధ వ్యథః నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమ స్తుష్టావ జన్యమ్ విసృజన్ జనార్దనమ్
“దేశబంధ శ్చిత్తస్య ధారణా” అన్నాడు పతంజలి. ఒకానొక లక్ష్యం మీదనే మనసును కట్టి వేయటం ధారణ. అలాటి ధారణా బలంతో హతాశుభః కర్మాశయాన్నంతటినీ ఖాళీ చేసుకొన్నాడా మహాయోగి. అంతేకాదు. ధ్యాన సమాధి బలంతో శరీరాన్ని త్యజించటానికి సంసిద్ధుడవుతాడు. శరీర త్యాగం ప్రయత్న పూర్వకంగా చేయటమనేది యోగమే గాని జ్ఞానం గాదు. జ్ఞాని ప్రారబ్ధానికి వదిలేస్తాడు శరీరాన్ని, అహినిర్లయని లాగా అది ఉన్నన్ని నాళ్లుండి పోయే నాటికి పోతుంది. వాడికిక పరమంటూ లేదు గద. యోగికలా కాక తాను చేరవలసిన పరలోకమంటూ ఒకటున్నది. అందుకోసం అవసానంలో ప్రాణాన్ని ఎలాగంటే అలా పోనీయకుండా హృదయస్థానం నుంచి సుషుమ్న ద్వారా భ్రూమధ్యానికీ అక్కడినుంచి సహస్రారానికీ చేర్చి ఆ తరువాత కపాలభేదం చేసుకొని ఆ బ్రహ్మరంధ్రంలోనుంచి దాన్ని సూర్యరశ్మిలో సంక్రమింపజేసి ఊర్ధ్వముఖంగా పయనించి ఆదిత్యమండలాన్ని కూడా దాటి తన కభిమతమైన లోకానికి పోయి చేరవలసి ఉంటుంది. అందుకే ఈ కలాపమంతా
Page 228