#


Index

సమాధియోగులు - భీష్మాదులు

నందు నాకాశ - మాకాశమందు దేజ మందు తేజంబు - నుదకంబు నందు నుదక మర్ధి గాయంబు మేదిని యందు గలిసె పూని వాని యథోచిత స్థానములుగ

  ఇలాటి వర్ణన చూస్తే హఠలయాది యోగాలలో అతడెంత నిష్ణాతుడో మనకర్థ మవుతుంది. అయితే ఇది ఎంత అభ్యసించినా చివరకు జ్ఞాన వైరాగ్యాలతోనే తప్ప దీనివల్ల తరించటమనేది వట్టిమాట. కాని ఆ జ్ఞాన వైరాగ్యాలు గట్టి పడాలంటే వాటికిది ఒక పూర్వ రంగం. ఇది ఒక్క పృథువే గాదు. భీష్మాదులైన మిగతా భాగవత పాత్రలెందరో ఈ మార్గంలో పయనించిన వారు కనిపిస్తారు మనకు.

  మొదట భీష్ముణ్ణి తీసుకొని చూతాము. కృష్ణభక్తుడని పేరేగాని మిగతా అక్రూరాదులలాగా ఆ కృష్ణుణ్ణి ఈయన నిత్యమూ అంటిపట్టుకొన్నట్టు ఎక్కడా కనిపించదు. అంటి ముట్టకుండానే కాలం గడుపుతుంటాడు. ఎన్ని ఉన్నా జీవిత ధ్యేయమితనికి సమాధి రూపమైన యోగమార్గమే. దాని కనురూపమైనదే ఆయన జీవితం కూడా. అసలు భీష్ముడంటేనే భీషణమైన వ్రతం పట్టినవాడు, పట్టు సడలని వాడని అర్థం. తండ్రి కోసం పెండ్లి మానేశాడు. రాజ్యం వదలుకొన్నాడు. మధ్యలో తల్లి బ్రతిమాలినా అపద్ధర్మంగానైనా తన వ్రతదీక్ష వదలలేదు. ఆ జన్మ నైష్ఠిక బ్రహ్మచారిగానే చివరిదాకా జీవితం సాగించాడు. తండ్రి శంతనుడు తన శీలానికి సంతసించి స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదిస్తే యుద్ధరంగంలో పడిపోయి కూడా వెంటనే ప్రాణాలు విడువలేదు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అంపశయ్య మీద ప్రాణాలుగ్గబట్టే పడి ఉన్నాడు.

  ఇదంతా బాగా పరిశీలిస్తే యోగుల లక్షణమే గాని జ్ఞానులది గాదు. జ్ఞాని ఆయన అన్నపారాశర్యుడు. తపస్సంపన్నుడూ జితేంద్రియుడయి కూడా తల్లి ఆజ్ఞాపించగానే మరదండ్రతో సంగమించి కురుసంతతి నిలబెట్టాడు. భీష్ముడిలాగా పెడమొగం పెట్టలేదు. అది పరిపూర్ణుడైన జ్ఞాని వ్యవహారం. అలాంటిది కాదిక్కడ. ఈయన యోగి. యమ నియమాదులను కర్కశంగా అనుష్ఠించే సమాధి యోగి. భీష్ముని కఠోర బ్రహ్మచర్యమూ, అపరిగ్రహమూ, ఇవన్నీ అష్టాంగ యోగ లక్షణాలలో

Page 227

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు