9. సమాధి యోగులు - భీష్మాదులు
కడచిన అధ్యాయంలో కర్మయోగమూ దాని నవలంబించి పయనించిన సాధకుల జీవితమూ సవిస్తరంగా నిరూపించబడ్డాయి. ఈ కర్మయోగమనేది మోక్షసాధన మార్గంలోఅన్నింటికన్నా మొట్టమొదటి మెట్టు. మనోవాక్కాయాలతో ఏది చేసినా సర్వమూ ఈశ్వరార్పణమంటూ చేయటమే దీని సారభూతమైన తత్త్వం. ఇది జ్ఞానానికి కేవలం బహిరంగమ గాని అంతరంగం కాదు. పోతే అంతరంగ యోగం వేరే ఉన్నది. అది సమాధియోగం. కేవల మీశ్వరార్పణమని చేయటం కాదిది. చేయకపోవటం. అది ప్రవృత్తి రూపమైతే ఇది నివృత్తి రూపం. చిత్తవృత్తి నిరోధకమైనదిది. సకల విధములైన మనోవాసనలనూ క్షాళితం చేసి లక్ష్యం మీద అచంచలమైన ఏకాగ్రతను సాధించటమే దీని ప్రధాన లక్ష్యం. మనసుమీద ఆధారపడిఉంది సర్వసిద్ధి. అది స్వాధీనమైతే చాలు సర్వం స్వాధీనమైనట్టే. కనుకనే ఈ సమాధి అంతరంగమయింది. ఈశావాస్యాది ఉపనిషత్తులలో ఈ యోగ స్వరూపమెంతగానో వర్ణించబడింది. భగవద్గీతలో ఆత్మ సంయమ అక్షర పరబ్రహ్మ యోగాలు రెండూ ఇదే. మరి పాతంజలా యోగ శాస్త్రాలిక చెప్పనే అక్కరలేదు. సాంగోపాంగంగా వర్ణించాయి ఈ యోగాన్ని. ఇది ఒకటిగా దీయోగం. ఇందులో హఠయోగముంది. మంత్రయోగముంది. లయయోగముంది. తారకయోగముంది.
ఈ నాలుగింటినీ భాగవతంలో ఆయా సాధకులు తమకు నచ్చిన మార్గాలలో యథోచితంగా అనుసరిస్తూ పోయినట్లు వారి జీవితాల వల్ల మనకు తేటపడుతూంది. అసలు పృథుచక్రవర్తి జీవితంలోనే చూచామాయన చివరికీ యోగాన్ని ఎలా అభ్యసిస్తూ వచ్చాడో.
కోరి మడమలచేత గుదపీడనము చేసి - పూని యుక్తా సనాసీనుడగుచు తనరమూలాధారమున నుండి వాయువు నొయ్యననెగ యించి యొనరనాభి కలితంబు గావించి క్రమమున హృద్వత్స కంఠశిరః కోష్ఠకముల జేర్చి కైకొనిమూర్ధ భాగమునకు నెగయించి ప్రాణముల్విడిచియాపవను – బవను
Page 226