#


Index

కర్మయోగులు - దక్షాదులు

  శరీరాన్ని విడవాలనుకొన్నా విడవలేకపోయాడు పృథువు. బ్రహ్మ భూతుడయి కదా విడువవలసింది. ఊరక విడిస్తే ఏమవుతుంది. అది “యేగేనాం తే తను త్యజా"మని యోగంతో వదలటం మాత్రమే. యోగంతో వదిలితే మరలా తగులుకొంటుంది ఎప్పుడో ఒకప్పుడు. పునరావృత్తి రాహిత్యం కలగదు. అలా కలిగేది పూర్ణజ్ఞాన మేర్పడినప్పుడే. అదే ఇప్పు డేర్పడింది పృథు చక్రవర్తికి. దీర్ఘకాల యోగాభ్యాస మూలంగా మనోవాసనలన్నీ క్షాళితం కాగా తత్ఫలితంగా నారాయణుడి మీద భక్తి అచంచలం కాగా-ఆ రెండింటి పరిపాకంతో జ్ఞాన వైరాగ్యాలు పరిపాకానికి రాగా, తత్పరిపాక ఫలంగా శరీరత్యాగం చేసి ముక్తి పొందాడట ఆ మహా భాగవతుడు. ఇలా కర్మయోగ కర్మ సమాధి యోగాల ప్రభావమేమిటో నిరూపించటానికీ పృథు చక్రవర్తి జీవితం తోడుపడుతున్నది. ఆనుషంగికంగా సాక్షాన్మోక్ష సాధనమైన జ్ఞానవైరాగ్య స్వరూపంకూడా నిరూపితమయింది ఇందులో. మొత్తానికి దక్షాదుల వృత్తాంతం దగ్గరి నుంచీ పృథ్వాదుల వృత్తాంతందాకా, ఇవన్నీ మానవుడి కర్మానుష్ఠాన తత్పరత్వమూ, కర్మయోగమూ, అందలి ఉత్తరోత్తరోత్కర్ష రూపమైన భూమికా క్రమమూ, చివరకది ఎక్కడ పర్యవసానం కావలసిందీ - సవిస్తరంగా వర్ణించబడ్డాయి. దాన్ని బయట పెట్టటానికి కేవల ముదాహరణ ప్రాయములే ఈ దక్షాదుల ఆఖ్యాయికలన్నీ. ఈ ఆఖ్యాయికలన్నీ భాగవతంలోనే. హరివంశాదులలో కనిపించవు మనకు. పృథుచక్రవర్తి వృత్తాంతం మాత్రం కనిపిస్తుంది హరి వంశంలో





Page 225

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు