#


Index

కర్మయోగులు - దక్షాదులు

బయలుదేరాడు. ఉగ్రమైన తపశ్చర్యకు దిగాడు. మొదట కందమూలాలు తరువాత తృణపర్ణాదులు ఆ మీదట కేవల జలపానం ఆ వలన వట్టి మారుతమే ఆహారంగా జీవించాడు.

మెండుగా మిట మిట మండు వేసవి యందు తప్త పంచాగ్ని మధ్యమున నిలిచి మానకజడి గొన్న వానకాలమునందు బైఁగోక వేయక బయట నిలిచి

  ఇలా శరీరాన్ని ప్రకృతి కొప్పజెప్పి కూడ తపస్సు సాగించాడు. ఇలా యోగ మార్గంలో ఎప్పుడు ప్రవేశించాడో అది సిద్ధించే సరికి నారాయణభక్తి అనన్య విషయమై ప్రవృద్ధమయిందట ఆ చక్రవర్తికి. అంటే యోగంవల్లనే భక్తి నిలిచిందన్న మాట. అంతేకాదు.

పరిపూర్ణంబగు భక్తిని కర మనిశము సంశయాత్మ కంబయి చాలన్ వరలిన హృదయ గ్రంథిని నిరసించు విరక్తి యుత మనీష జనించెన్

  ఆ భక్తి బలంతో హృదయ గ్రంథి విచ్ఛేదనం చేసుకోవాలనే సంకల్పం కూడా కలిగిందట ఆయనకు. కాని కేవల భక్తి కాగ్రంథి భేదనం.

  చేసే శక్తి చాలదని గ్రహించాడు. గ్రహించి సమస్త యోగసిద్ధుల యందు నిః స్పృహుడయి బ్రహ్మభూతుండయి నిజ కళేబరంబు విడువ నిశ్చయించాడట.

  మరి బ్రహ్మభూతుడు కావాలంటే ఏమిటి మార్గం. కేవల యోగం కాదు. కేవల భక్తిగాదు. అవి రెండూ ఆలంబనాలుగా చేసుకోవాలి సాధకుడు. చేసుకొంటే అవి క్రమంగా జ్ఞానాన్నీ వైరాగ్యాన్నీ ప్రసాదిస్తాయి. ఆ జ్ఞాన వైరాగ్యాలే సాక్షాన్ముక్తి హేతువులు. అందుకే

జ్ఞాన వైరాగ్య వీర్యేణ స్వరూపస్థో ఽ జహాత్ప్రభుః

Page 224

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు