#


Index

కర్మయోగులు - దక్షాదులు

వదలకపోవటమే. సర్వాత్మనా భగవచ్చింతన ఉన్నప్పుడే కర్మలకు స్వస్తి చెప్పగలడు మానవుడు. చెప్పలేకపోయాడంటే భక్తిలో దౌర్బల్యముందని అర్థం. అందుకే పృథువు కాయన ప్రత్యక్షమైనా వరం కోరమని చెప్పినా లక్ష్మిలాగా నీ సేవ నాకు నిత్యమూ దయచేయమని ఆ భక్తుడాసించినా దానిని భగవానుడు వెంటనే ప్రసాదించలేదు. మీదు మిక్కిలి ప్రజాపాలన కర్మమే విధించి వెళ్లాడు. అలా నిష్కామ కర్మ చేస్తూ పోతే కొంత కాలానికి గాని అది పూర్ణభక్తి యోగంగా పరిణమించదని అప్పుడు గాని అతడనుగ్రహపాత్రుడు కాడని భగవదభిప్రాయం.

  చూడండి. దానికి తగినట్టుగానే అన్ని మాటలు చెప్పి ఆ రాజు మరలా అవివేకంలోనే పడ్డాడు. భగవత్సాక్షాత్కారమైనా భక్తి యోగమతనికి పట్టుబడలేదు. సాక్షాజ్జగన్మాతతోనే పోటీపడి సేవిస్తానన్న పెద్ద మనిషి తలమునకలుగా మరలా కర్మానుష్ఠానంలో మునిగిపోయాడు. అవి యజ్ఞాలే గావు. యాగాలే గావు. క్రతువులే గావు. తుదకు దీర్ఘసత్రమనే యాగానికి దీక్ష వహించాడు. పైగా అక్కడి సభాసదులతో ఇలా అంటాడు. నేనీ లోకస్థితి మర్యాదలు తప్పిపోకుండా కాపాడటం కోసమా కమలాసనుని చేత నియోగింపబడ్డవాడను. కామదుఘములు నైన లోకములు నాకు సరవి గలుగు ననుష్ఠానపరుడగాన. మీరు నాకు పరంలో ఎంతో గొప్ప ఫలానుభవం కలిగే ఉత్తమ కర్మమేదో దాని నుపదేశించమని ప్రాధేయపడతాడు. వారతని చిత్తశుద్ధిని పరీక్షించటానికి మొదట నాస్తికత్వాన్ని ప్రదర్శించి తరువాత అతని అచంచలమైన ఈశ్వరార్పిత బుద్ధికి సంతసించి కీర్తిస్తారు. ఆ పిమ్మట సనకాది దివ్యమునీంద్రులు వచ్చి ఆయన కధ్యాత్మ తత్వోపదేశం కూడా చేసి పోతారు.

  అయితే చిత్రమేమంటే అప్పటికీ జ్ఞానమంటలేదాయనకు. భక్తిఅంటితే గదా జ్ఞానమంటటానికి. ఆ భక్తి అంటకపోవటానికేమి కారణం. కర్మవాసనలు. ఆ వాసనలు క్షాళితమైతే గాని ఏదీ మనసుకు హత్తుకోదు. అంతవరకూ దాని నడపా దడపా భావించటమూ, భాషించటమూ తప్ప తదేక పరాయణుడు కాలేడు మానవుడు. అన్ని అనర్ధాలకూ మూలం కర్మవాసనలే. చివరకా దోషాన్ని గుర్తిస్తాడు పృథుచక్రవర్తి. కర్మవాసనలను నిర్మూలన చేయాలంటే దానికి భక్తి కాదు. జ్ఞానం కాదు. బాగా ప్రబలంగా నాటుకొని ఉంటే వాటిని పెరికి వేయటానికివి ఏవీ చాలవు. సమాధి యోగమే వాటికి తగిన భేషజం. దాన్ని సాధించటానికి నడుము కట్టి అడవులకు

Page 223

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు