నీవు మానవోత్తముడవయి కూడా ద్రోహచింత పెడుతున్నావు. ఆత్మ అంటే కళేబరమని భ్రమిస్తున్నావు నీవు. నీబోటివారు కూడా దేవమాయను గుర్తించలేక పామరచర్యలకు పాల్పడితే ఇక నీవు చిరకాలం చేసిన వృద్ధ సేవకు ఫలమేమున్నది.
ఇలా మందలిస్తూనే అతని మీద ఉండే అమందమైన వాత్సల్యంతో వరం కోరుకోమని అడుగుతాడు. అప్పటికే భగవద్భక్తి భరితాంత రంగుడూ బాష్ప పరిఫ్లు తలోచనాపాంగుడూ అయిన పృథుచక్రవర్తి కొన్ని క్షణాలు మాట రాక నిలిచిపోయి తరువాత ఇలా భాషిస్తాడు.
నకామయే నాథ తదప్య హం క్వచి న్నయత్ర యుష్మ చ్చరణాంబు జాసవః
స్వామీ నాకు నీ చరణాంబుజ మరంద గంధం లేని పదవి ఏదైనా సరే అక్కరలేదు. దాని నెడబాయకుండటమే నా పాలిటి కొక పెద్ద వరం.
అథా భజంత్వాఖిల పూరుషోత్తమం గుణాలయం పద్మక రేవలాల సః పద్మాలయ అయిన ఈ జగన్మాత మాదిరి గుణాలయుడైన నిన్ను నిరంతరం సేవించాలని నా చింత.
అప్యావయో రేక పతిస్పృధోః కలి ర్నస్యాత్కృతత్వ చ్చరణైక తానయోః
మా ఇద్దరికీ ఏకైక శరణమైన నీ చరణాన్ని పట్టుకోటంలో పరస్పరం కలహమనేది కలగకుండు గాక “జగజ్జనన్యాం జగీశ వైశసం స్యాదేవ” అంతేకాదు. ఒకవేళ కలహమేర్పడినా పరవాలేదు. సద్విషయంలో ఏర్పడే స్పర్ధవల్ల నష్టమేముంది. కాబట్టి "యథా చరే ద్బాల హితం పితా స్వయం తధాత్వమే వార్హసి నస్సమీహితుమ్” తెలిసీ తెలియని కుర్రవాడికి కావలసింది తండ్రే ఎలా తెలుసుకొని చేస్తాడో అలాగే అజ్ఞుడనైన నా అభిమతమేదో నీవే తెలిసి ప్రసాదించమని ప్రార్ధిస్తాడు.
ప్రార్ధిస్తే అనభిమతమైన రోషాన్ని త్యజించావదే చాలు. నీవు నా ఆజ్ఞ పాలించే వాడవైతే దీర్ఘకాల మీ భూమండలాన్ని ధర్మమార్గం తప్పక పాలించమని చెప్పి అంతర్ధాన మవుతాడు. అంటే ఏమిటప్పటి కర్థం. పృథువింకా పరిపక్వం కాలేదు. ఎంత భక్తుడైనా ఆ భక్తి పరిపూర్ణత నందుకోలేదు. కారణం కర్మానుష్ఠాన బుద్ధి
Page 222