అప్పటికే వేనుడి దౌర్జన్యంవల్ల భూమి అంతా దుర్భిక్ష పీడితయై గొడ్డుబోయింది. పాడి పంటా అనేవి కలలోని వార్తలయినాయి. ప్రాణులంతా హాహాకారాలు చేస్తుంటారు. తట్టుకోలేక వచ్చి పృథువును ప్రార్ధిస్తారు. కర్తవ్య దీక్షాధురంధరుడైన ఆ రాజు ధనుర్ధారుడై భూమి ఎక్కడ ఉందా అని వెతుకుతూ బయలుదేరుతాడు. అది గోరూపాన్ని ధరించి తప్పించుకుపోతుంటుంది. శరసంధానం చేసి నిన్ను చంపుతానని బెదిరిస్తాడు. అయ్యా ఆగ్రహించకండి - దుర్మార్గుల పాలనలో ఉండలేక పరుగెడుతున్నాను. నీ విప్పుడుత్తముడవు వచ్చావు కాబట్టి నీ అభిమతం తీరుస్తాను. నా పాలు పితుకుకోండి. రత్నౌషధి రస లోహాది వస్తు జాతమంతా మీ చేతికి వస్తుందని సలహా ఇస్తుంది. అలాగే చేస్తాడా చక్రవర్తి. మరలా సస్యశ్యామల మవుతుంది మహీమండలం. ఎంత సాభిప్రాయమైన ఉదంతమో చూడండి ఇది. మానవులకు కరువు కాటకాలు వస్తున్నాయంటే అది ప్రకృతి వైపరీత్యం. దానికి కారణం మానవులు. అందులోనూ ముఖ్యంగా పాలకులైన వారి బుద్ధి వైపరీత్యం. మన బుద్ధులను బట్టే బాహ్య ప్రకృతి. ఇవి బాగుపడితే అదీ బాగుపడుతుంది. మంచి ఫలితమే ఇస్తుంది. లేకుంటే ధర్మ విప్లవం తప్పదు.
పరిపాలన చక్కపడ్డ తరువాత పృథువు నిరంతరమూ ఉత్తమ కర్మానుష్ఠానంతోనే కాలం గడుపుతాడు. విష్ణువు నిష్టదైవతంగా భావించి ఆ దేవునికే తన జీవితమంకితం గావిస్తాడు. కొన్నాళ్లకు వీరోచితమైన అశ్వమధం చేయ తలపెడతాడు. తొంభయి తొమ్మిది చేస్తాడు. నూఱవది చేయబోయే సరికి మత్సరగ్రస్తుడైన మహేంద్రుడు మేధ్యాశ్వాన్ని అపహరిస్తాడు. కోపోద్రిక్తుడయి పృథువు ఋత్విక్కుల సహాయంతో మహేంద్రుణ్ణి నాశనం చేయాలని అఖిచారహో మాని కుద్యుక్తుడవుతాడు. అయితే అది సాగదు. ఆ పాటికి బ్రహ్మాదులు వచ్చి అడ్డు పడతారు. కడకు శ్రీ మహావిష్ణువు కూడ ప్రత్యక్షమై మందలిస్తాడారాజును.
సుధి యస్సా ధవో లోకే నరదేవ నరోత్తమాః
నాభి ద్రుహ్యంతి భూతే భ్యో - యర్హినాత్మా కళేబరమ్
పురుషాయది ముహ్యంతి - త్వాదృశా దేవమాయయా
శ్రమ ఏవ పరం జాతో దీర్ఘ యా వృద్ధ త్సవయా /
Page 221