#


Index

కర్మయోగులు - దక్షాదులు

కాలానికి మన మధీనమయి ఉన్నంత కాలమూ చాలా భయంకరంగా వచ్చి నెత్తిన పడుతుంది దాని ప్రభావం. అలా కాక కాలాన్నే మన మధీనం చేసుకోగలిగామంటే అప్పుడు దాని ప్రభావమే మాత్రమూ మనమీద పనిచేయదు. ఒకవేళ ప్రారబ్ధవశాత్తూ సుఖదుఃఖాది భావాలు ప్రాప్తిస్తున్నా అవి తత్త్వాను సంధాన బలంతో దగ్ధపటంలాగా బలహీనమై ఊరక నామమాత్రంగానే దర్శనమిస్తాయి. మాత్రా స్పర్శల మూలంగా వాడికెలాంటి మోదమూ లేదు. భేదమూ లేదు. నిత్యముక్తుడైన పరమేశ్వరుడికైతే ఈ కాలమెప్పుడూ అధీనమే. అది ఆయనకు వశవర్తి అయి మెలగుతుంటుంది. ఈ భావానికి సంకేతమే మహావిష్ణువు చేతిలోని సుదర్శనాయుధం. అది భక్తుల పాలిటికి సుదర్శనం. భగవద్రూపాన్నే నిరంతరం దర్శించేవారు కాబట్టి వారికీ కాలచక్రమూ దాని పరివర్తనమూ కూడా సుదర్శనంగానే భాసిస్తుందని భావం. అంతేకాదు. పరమేశ్వరుడి కది ఎలా వశవర్తి అయి పనులు చేస్తుందో ఈ భక్తుడికీ అలాగే వశం వదమై అతడి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూ ఉంటుంది కూడా. విష్ణువు స్వయంగా తెచ్చి అంబరీషుడికి చక్రమిచ్చి పోవటంలో ఇంత అంతరార్థముంది.

  పైగా ప్రతిభట శిక్షణమూ, నిజజన రక్షణమట ఆ చక్రం. “కాలోస్మి లోక క్షయ కృత్ ప్రవృద్ధః" అన్నట్టు లోక ధర్మాన్ని కాపాడాలన్న అధర్మాన్ని నిర్మూలించాలన్నా కాలమే దానికి మూలకారణం. తన్మూలంగానే ఆ పరమాత్మ ఆ రెండు కార్యాలూ నిర్వహిస్తూంటాడు. దానికిక తిరుగులేదు. నిఖిల జగదవక్రమైన చక్రమది. ఎక్కడికి వెళ్లినా ఏదేశ కాలాల్లోనైనా దాని గమనాని కడ్డులేదు. “యద్భావి తద్భవతి” అన్నట్టు జరిగేది జరిగి తీరవలసిందే. అది దాని పాటికది ఎలాగూ జరుగుతుంది. అలా కాక మన కధీనమైనప్పుడు మన ఇచ్ఛానుసారంగా జరుగుతుంది. ఈశ్వరేచ్ఛ ధర్మ సంస్థాపనమే కాబట్టి తదనుగుణంగానే ప్రవర్తిస్తుందది. అది భాగవత జనులు సురక్షితంగా మనుగడ సాగించినప్పుడే గనుక వారి మనుగడకు కూడా భంగం కలగకుండా చూడాలది. అది ఎలా సంభవం. వారి కుపద్రవం కలిగించే పరిస్థితులేర్పడరాదు. అలాంటి వారిని తగినట్టు శిక్షించాలది. వారే లోకాలలో ఎక్కడికి పరుగిడిపోయినా వదలరాదు. వారిని వెంబడించి తరిమి కొట్టాలి. ఏవంవిధ విశేషణ విశిష్టమైన చక్రం అంబరీషుడికి ఆ భగవానుడు ప్రసాదించాడంటే ఇది రాబోయే దుర్వాసో వృత్తాంతానికెంతగా నాందీ పలుకుతున్నదో

Page 216

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు