జంబాలం. అది ఆ భగవద్భక్తి అనేది కరావలంబమిస్తే గాని జరగదు. “తేషా మహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్" అని గదా భగవంతుడి హామీ. అది బాగా పైకి లాగితే గాని ఈ మాలిన్యం పూర్తిగా వదలిపోదు. అలా వదలిపోయిన మహాత్ముడు నూటికి కోటికే ఒక్కడో. ఆ అంబరీషుడలాంటి మహనీయుడు గనుకనే ఇక రాజ్యం భోజ్యమనుకోలేదు. సంసార చింతకు దూరుడై ఏకాంతంబున భక్తి పరవశుడయి కూచున్నాడు.
ఇలాటి పరిపాకం భాగవతుడికి ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటాడు ఆ ఈశ్వరుడు కూడా. “యే యథా మామ్ ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్” అని గదా చాటాడు. ఎవడెలా తన్ను సేవిస్తే వాడినలాగే చూస్తాడు. ఆర్హుడయి సేవిస్తే ఆర్తినే పోగొడుతాడు. కామ్యంతో సేవిస్తే కామితార్థమే ఇస్తాడు. అలాకాక “అనన్యా శ్చింతయం తోమా” మన్నట్టు మరే ప్రాపంచిక దృష్టి లేక తనమీదనే దృష్టి పెట్టుకొని బ్రతికితే అలాంటి ఏకాంత భక్తులకు తన అభయముద్రనే ప్రసాదిస్తాడు. వారికిక ఎవరివల్లా భయంలేదు. 'యోగక్షేమం వహామ్యహ' మన్నట్టు వారి యోగక్షేమాలన్నింటినీ అదే చూస్తూ పోతుంది. వాటి కోసమిక ఆ భాగవతుడు వెతుక్కోనక్కరలేదు. అలా వెతికాడంటే అది అనన్య దృష్టి కాదు. అన్యదృష్టి మరలా చోటు చేసుకొని కూచుంటుంది. ఈ సంసార విషయ వాసన లొక పెంజీకటి లాంటిది. భక్తి భావమనే చండమార్తాండుడు సహస్ర ముఖాలతో ప్రకాశిస్తున్నంత వరకూ ఇది పక్క వంచి ఉంటుంది. ఎప్పుడా వెలుగు కొంచెం మందగిస్తుందో కనిపెట్టి చూస్తుంటుంది. మందగిస్తుందో ఆ మేరకు మరలా వచ్చి నెత్తిన పడుతుంది. భాగవతుని జీవితం అంధకార బంధురం చేస్తుంది. అంటే పరమార్థానికి దూరం చేస్తుందని అర్థం. అంచేత దానికెడమివ్వకుండా ఎవడు నిరంతరా నన్య చింతనతో కాలం గడుపుతుంటాడో వాడి జీవితమిక భగవదంకిత జీవితం కాబట్టి భగవంతుడే చూచుకొంటాడిక వాడి యోగక్షేమాలు. భగవంతుడి లాగా వాడికీ ఈ సాంసారిక భయం లేదు.
అలా భయం లేదని చెప్పటాని కొక సంకేతమే అంబరీషుడికి సుదర్శన చక్రాన్ని విష్ణువు ప్రసాదించి పోవటం. చక్రమనేది కాలచక్రమే. చక్రం చేతికి వచ్చిందంటే కాలమే మనకధీనమయిందని భావం. కాలంలోనే కదా మనకే సుఖమైనా దుఃఖమైనా ప్రాప్తించేది. ఏ భావం మనకెప్పుడు కలిగినా అది ఏదో ఒక కాలంలోనే. అది
Page 215