లంకెపెట్టి విహిత రాజ్యవృత్తి విడువని వాడునై” రెండింటినీ సమన్వయించుకొని బ్రతుకు సాగించటం మూలాన్నే అతడు రాచతపసి అనిపించుకొన్నాడు.
కానీ ఇది ఎంతోకాలం సాగదీ ద్వైరాజ్యపాలన. ఒకటి సంసారం. మరొకటి సాయుజ్యం. ఒకటి విషయ ప్రపంచం. మరొకటి అవిషయమైన ఆత్మ స్వరూపం. ఒకటి అనేకత్వం. మరొకటి ఏకత్వం. ఒకటి అంతకంతకు బంధాపాదకం. మరొకటి మోక్షదాయకం. ఒకటి హెచ్చే కొద్దీ మరొకటి లొచ్చుగాక తప్పదు. అందులో ఏది హెచ్చాలి. ఏది తగ్గాలి. దేనికి బలమెక్కువైతే అది నిలుస్తుంది. ఏది దుర్బలమైతే అది లయిస్తుంది. నిత్యమైనది భగవత్తత్త్వం. మనం కన్నా కనకున్నా అది ఉన్నది. తదాభాస అయిన ఈ విషయ ప్రపంచమనిత్యం కంటే ఉంటుంది. కనకుంటే లేదు. కాబట్టి అది గట్టిగా నిలిస్తే ఇది దానిలోనే కలుస్తుంది. అప్పుడిది విశేష రూపంగా ఎక్కడా కనిపించదు. కాబట్టి దీన్ని పట్టుకొని దాన్ని సేవించటమంటూ ఉండబోదు. ఇది పూర్తిగా వదలిపోతుంది భాగవతుణ్ణి. అయితే అది క్రమంగా గాని పరిపాకానికి రాదా భావం.
అంబరీషుడి కిలాంటి పరిపాకమే వచ్చింది జీవితంలో. దానితో
అతని కీహ మానె హరులందు గరులందు ధనములందు గేళి వనములందు బుత్రులందు బంధుమిత్రుల యందును బురము నందు నంతిపురము నందు
ధన కనక వస్తు వాహన బంధు మిత్రాది చరాచర జగత్తుమీదనే విరక్తి కలిగింది. అలా కలిగిన నాడిక యథాపూర్వంగా దాన్ని అంటి పట్టుకొని ఉండటం కల్ల. అంచేతనే కొంత కాలంబున కమ్మేదినీ కాంతుండు సంసారంబు వలని తగులంబువిడిచిన వాడయినాడు. విడవటమే గాదు. విడిచి నిర్మలుడయినాడు. విడిచిన తరువాత గాని నిర్మలుడు కాలేడు మానవుడు. ఎంత మహాభాగవతుడైనా ఎంత అసిధారావ్రతంగా బ్రతికేవాడైనా సరే. సంసార పంకంలో దిగబడి ఉన్నంత వరకూ దాని కళంకం కొంచెమైనా అంటకపోదు. అంటితే నిర్మలుడెలా కాగలడు. మలినుడే అవుతాడు. నిర్మలత్వం బాగా అలవడాలంటే పూరా వదలిపోవాలీ సంసార
Page 214