అడవులలో కొండలలో కాలం గడిపాడు. ఇతడలా కాదు. రాజ్యం చేస్తూనే ఉన్నాడు. ప్రజల మధ్యనే ఉన్నాడు. తన విద్యుక్తధర్మం తాను పాటిస్తూనే ఉన్నాడు. అయినా ఏదీ అంటి ముట్టకుండా బ్రతుకుతుంటాడు. మహావిభవ సంపచ్చాతురి గలిగి కూడా మొదటినుంచీ వైష్ణవార్చనల మేరకే కాలం గడుపుతూ వస్తాడు. అనుక్షణం తన సర్వస్వమూ ఆ శ్రీమహావిష్ణువేనని భావించాడు. దర్శించాడు. రంతిదేవుడంత స్పష్టంగా భగవత్స్వరూపాన్ని పట్టుకొన్నవాడు కాడు. సగుణంలో అది కొంత తగ్గుస్థాయి. ఈ అంబరీషుడిది చాలా హెచ్చుస్థాయి. కనుకనే అతనికి చివరనెప్పుడో గాని సాక్షాత్కారం కాలేదు. అదీ బ్రహ్మాది దేవతలే అతనికి సాక్షాత్కరించింది. అంబరీషుడికలా గాదు. నిత్యమూ శ్రీ మహావిష్ణువు సన్నిధి చేస్తూనే ఉన్నాడు. దర్శనమిస్తూనే ఉన్నాడు.
అందుకు కారణం. అనుక్షణమూ సర్వాత్మనా తదాకారాంకిత చిత్తవృత్తియే.
చిత్తంబు మధు రిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠన మంద కరములు విష్ణు మందిర మార్జనము లంద చెవులు మాధవ కథా శ్రవణ మంద చూపులు గోవింద రూప వీక్షణ మంద శిరము కేశవ నమస్కృతుల యంద పదము లీశ్వర గేహ పరిసర్పణము లంద కామంబు చక్రి కైంకర్య మంద
ఇలా తన తను ధన మనః ప్రాణాలన్నీ భగవదర్పితం చేస్తూ వచ్చాడు. అయితే మనోవాక్కాయాలు మూడూ పరాయత్తమైతే ఇక స్వాయత్తమేముంది. ఏదీ లేకపోతే "సప్త ద్వీప విశాల భూభరము దోస్తం భంబునం బూన్చె" నన్నారే. ఎలా పూనగలిగాడా చక్రవర్తి. ఇదే చిత్రం. సప్త ద్వీప పరీతమైన ధరాతలాన్ని పరిపాలిస్తున్నా దానితో పాటీ భక్తి సామ్రాజ్యాన్నికూడా పాలిస్తూనే ఉన్నాడు సుప్తం బొందక యొప్పెనట. ఈ మాటలో ఉన్నది మర్మమంతా. భక్తి అనేది కత్తిమీది సాము. నడుస్తూనే పోవాలి. మరలా పాదం తెగకుండా చూచుకోవాలి. అంటే అర్థం. ప్రాపంచికం వదులు కోకుండానే పారమార్థికం నిలుపుకో గలగాలి. వాడే ధీరుడు. “విష్ణువు మీద మనసు
Page 213