#


Index

కర్మయోగులు - దక్షాదులు

కావాలో కోరుకోమని అడుగుతారు. అప్పుడు కూడా అతడు ప్రలోభానికి తావివ్వడు. గురికాడు.

సవై తేభ్యో నమస్కృత్య నిస్సంగో విగతస్పృహః వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనః పరమ్

  ఏమీ అక్కరలేదని చెప్పి తనకు భగవద్భక్తి స్థిరంగా ఉంటే చాలు. అదే పదివేల వరాలని భావిస్తాడు. నిండు మనసుతో నీవొకటి త్యాగం చేయగలిగినా కనీసం చేయాలనే బుద్ధి ఉన్నా చాలు. అంతకంతకది నీకు ఇను మిక్కిలిగా ఫలితమిస్తుంది. "త్యక్తేన భుం జీథాః త్యజతైన హి భోక్తవ్యమ్" అని గదా శాస్త్రవాక్యం. అంతకు ముందు తన విషయంలో జరిగిందంతా తన పరీక్షార్ధం జరిగిన విష్ణుమాయా విలాసమని గ్రహిస్తాడు.

ఈశ్వరాలంబనమ్ చిత్తమ్ కుర్వతో నన్య రాధనః మాయా గుణ మయీ రాజన్ స్వప్నవ త్ప్రత్యలీయత

  చివర కతడలా తన మనసు భగదాలంబనం చేసి బ్రతుకు సాగిస్తూ పోతే భగవన్మాయ నవలీలగా దాటిపోగలిగాడట. అంటే ఏమన్నమాట. యావజ్జీవమూ మానవుడు తనకు ధ్యేయమైన ఈశ్వరతత్త్వాన్నే మనసా వచసా కర్మణా పట్టుకొని పోతే మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడుదుడుకులేర్పడినా ఆ ఈశ్వర భావనా బలంతోనే దాటిపోగలడు. ఆ భావనే సాత్త్వతమైన భక్తిని ప్రసాదించి చివరకా ఐశ్వరమైన మాయాశక్తిని కూడ దాటిపోయే శక్తిని సమకూరుస్తుంది. ఇదే రంతిదేవుని చరిత్రలో మనకు తార్కాణమవుతున్న సత్యం.

  రంతిదేవుడి జీవితంకన్నా పెద్ద పరీక్ష అంబరీషుడి జీవితం. కర్మ యోగాని కిది పరాకాష్ఠ. భగవద్రతి గలవాడు రంతిదేవుడైతే అది తన అణువణువూ వ్యాపించినవా డంబరీషుడు. అంబరీషమన్నా ఋజీషమన్నా బాణలి అని అర్ధం. బాణలి ఎప్పుడూ గనగనమని మండే నిప్పులమీద ఉంటుంది. వేలు పెడితే కాలుతుంది. దానిమీద ఏది వేసినా మాడ్చి పారవేస్తుంది. అలాగే కర్మవాసనలనన్నిటినీ మాడ్చి మసి చేసినవాడని అర్థం. దానికి మూల కారణం భక్తి. ఈ భక్తి రంతిదేవుడి భక్తిలాంటిది కాదు. అతడు తనకున్నదంతా దానం చేసి రాజ్యాన్నీ ప్రజలనూ వదిలేసి

Page 212

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు