#


Index

కర్మయోగులు - దక్షాదులు

అన్నము లేదు - కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న-రా వన్న శరీర ధారులకు నాపద వచ్చిన వారి యాపదవ్ గ్రన్నన మాన్చివారికి సుఖంబులు సేయుట కన్న నొండు మే లున్నదె - నాకు దిక్కు పురుషోత్తము డొక్కడ సుమ్ము పుల్కసా

  మానవసేవ చేస్తే చాలు అదే మాధవసేవ అనే సూక్తినెలా చాటాడో చూడండి. అంతేకాదు. అంత నిస్వార్ధమైన సేవా పరత్వముండాలే గాని భౌతికమైన క్షుత్పిపాసాదులు కూడా వాడినేమీ బాధించవు. రంతిదేవుని మాటలలోనే దాఖలా అవుతుంది మనకు.

క్షుత్తృట్రమో గాత్ర పరిభ్రమశ్చ దైన్యం క్లమః శోక విషాద మోహాః సర్వే నివృత్తాః కృపణస్య జంతోః జిజీ విషోర్జీవ జలార్పణాన్మే

  క్షుత్తృభ్రమ క్లమశోక విషాదాది దోషాలన్నీ నాకు తొలగి పోయాయంటాడు. దానికి కారణ మాయన సర్వత్రా భగవత్తత్త్వాన్ని చూడటమే. బ్రాహ్మణుడేమిటి. శూద్రుడేమిటి. చండాలుడేమిటి. అంతా భగవత్స్వరూపమే. సర్వమూ భగవత్సృష్టి అయినప్పుడందులో ఇక తేడా ఏముంది. పండితాస్సమ దర్శినః అని భగవానుడే చాటాడు గదా గీతలో. ఆ గీతా శ్లోకాని కుదాహరణమే ఈ రంతిదేవుడి వ్యవహారం.

  అయితే ఎటువచ్చీ అలా చూడగలగాలి. చూస్తే సర్వత్రా సామ్యమే. వైషమ్యమణు మాత్రం కూడా గోచరంకాదు. వైషమ్యమే సంసారం. అదే తాపత్రయానికి మూలం. పోతే సామ్యం భగవత్స్వరూపం. దానినే దర్శించే కర్మయోగికంతా తద్రూపంగానే మారి కనిపిస్తుంది. అప్పుడు సంసారం కాదది సాయుజ్యం. ఆ దశలో ప్రాకృతమైన తాపత్రయాని కాస్కారమేముంది. ఒకటి భౌతికంగా ఉన్నా లేకపోయినా దిగులు లేదు. కొఱత లేదు. పరిపూర్ణమైన స్వరూపాన్నే దర్శిస్తున్నాడు కాబట్టి సర్వమూ పరిపూర్ణంగానే అనుభవానికి వస్తుంది. భౌతికంగా అనుభవించి సంతృప్తినీ నిర్వృతినీ ప్రసాదిస్తుంది. అయితే ఇది మాటలు గాదు. మనోవాక్కాయాలు మూడింటిలో ఏక రూపంగా వర్తించాలి మానవుడు. అప్పుడే అది ఫలితమిచ్చేది. అలా వర్తించగలిగాడు రంతిదేవుడు. కనుకనే బ్రహ్మాది దేవతలాయనకు చివర ప్రత్యక్షమవుతారు. ఏమి

Page 211

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు