
జప హోమాధ్యయనంబులు
తపములు వ్రతములును లేని తరుణులు హరిస తృపఁబడసి - రన్ని గలిగియుఁ జపలతఁబొందితిమి భక్తి సలుపమి నకటా
హరి మాయ మనలను మోహింపజేసినదని ఆక్రందనం చేసి కూడా కంసుని వలన భయంతో ఆ హరిని దర్శించటానికి మోమోడి ఊరకునాట.
దీనివల్ల మనకు తేటపడిన రహస్యమేమిటింతకూ. ఎన్ని యాగాలు చేసినా, జపహోమాదులు గావించినా, ఇదంతా కేవల కర్మానుష్ఠానమే. ఫలితమవి ఇవ్వలేవు. కారణమందులో సకామమైన భోగదృష్టి తప్ప నిష్కామమైన ఈశ్వరదృష్టి లేదు. ఈశ్వరుడే అసలు యజ్ఞపురుషుడు. యజ్ఞోవై విష్ణుః యజ్ఞస్వరూపుడాయన. యజ్ఞ ఫలదాత కూడా ఆయనే. అలాంటి ఈశ్వరుణ్ణి విస్మరించి ఏ యజ్ఞాది కర్మలు చేసి ఏమి ప్రయోజనం. అయితే ప్రయోజనమే లేదా అంటే ఉంది. అది స్వర్గాదుల మేరకే. దాని కతీతమైన మోక్షప్రాప్తికది తోడ్పడనేరదు. అలా తోడ్పాలంటే అది ఏ కామనాలేని భగవద్భక్తి భావన ఒక్కడే ఉండాలి. వారికిక ఏమి లేకపోయిన నిష్కామమైన భక్తి తాత్పర్యాలు మిన్ను ముట్టి ఉన్నాయి. కనుకనే వారాయనకు యజ్ఞదీక్ష అని కూడా చూడక సకల విధములైన పదార్ధాలూ నివేదించారు. ఆయన ప్రసాదానికి పాత్రులయ్యారు. ఇక్కడ నివేదించింది తమ జీవిత సర్వస్వాన్ని. "సర్వ ధర్మాన్ పరిత్యజ్య” అన్నట్టు అంతా భగవదంకితం చేసినప్పుడే మానవుడు తదనుగ్రహానికి నోచుకొంటాడు. లేకుంటే ఆ ముని జనుల మాదిరే ఎలాంటి ఆత్మార్పణమూ చేసుకోలేడు. చివరకు తన తప్పు గ్రహించినా ఏదో ఒక భయంతో ఆ తత్త్వాన్ని భజించటానికి కూడా నోచుకోలేడు. సంకోచంతో వెనక్కే తగ్గుతాడు. కంసుడి భయంతో వారు వెనక్కు తగ్గారని వర్ణించటంలో అభిప్రాయమిదే. ఇదీ ఈ కథవల్ల మనం తెలుసుకోవలసిన ధర్మ సూక్ష్మం.
పోతే ఇక ఇలాటి జంకు కొంకు ఏ కోశాన లేక తాను ధ్యానించే ఈశ్వరుడికే చివరదాకా తన జీవితాన్ని అంకితం చేసిన వృత్తాంతం రంతి దేవుని వృత్తాంతం. కర్మయోగానికి గొప్ప ఉదాహరణ మాయన జీవితం. రంతి అన్నా రతి అన్నా ఒక్కడే. భగవద్రతి ఎక్కువగా గలవాడని భావం. తక్కువ వాడు కాడాయన. ఒక
Page 209
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు