సనివలద నంగ- నటుదలడని మాదొడ్డుచు జగదీశ్వరునకు జడ్డన నన్నంబు గొనుచు జని రాసుదతుల్" మగలు, బిడ్డలు, తోబుట్టువులూ ఎవరు వచ్చి అడ్డు పెట్టినా లెక్క చేయక భక్ష్య భోజ్యాదులైనచతుర్విధాహారాలూ తీసుకొని సముద్రమివ నిమ్నగా సముద్రాని కెదురు నడిచే గంగాది నదులలాగా మహాసంభ్రమంతో నడిచి వెళ్లేరట. వారిని చూడగానే భగవానుడు. "స్వాగతమ్ వో మహభాగా - ఆస్యతామ్-కరవామకిమ్" మీ కందిరికి స్వాగతం. ఇలా వచ్చికూచోండి. మీకు నేనేమి చేయాలి చెప్పండి. “మమ్ము నిచటన్ వీక్షింప నేతించినారెంతో వేడుకతో - నన్ను ధీమంతుల్ మీవలె జేరికందురు గదా మత్సేవలన్ సర్వమున్”
తద్యాత దేవ యజనమ్ పతయోవో ద్విజాతయః స్వసత్రమ్ పారయిష్యంతి యుష్మాభి ర్గృహ మేధినః
ఇక వెళ్లండి. మీ పతులు యజ్ఞం చేస్తున్నారు. అది మీరు లేకుంటే సఫలం కాదని బోధిస్తాడు. ఆ మాటలు విని వారు
తగునే మాధవ యిట్టివాడి పలుకుల్ - ధర్మంబులే మాయెడన్ మగలున్ బిడ్డలు సోదరుల్ జనకులున్ మమ్మున్ నివారింప – మ చ్చిగ నీయం ఘ్రులుసేరి నారమటవో ఁజేకొందురే వారలా పగిదే మొల్లము కింకరీ జనులుగా భావించి రక్షింపవే
మళ్లీ వెళ్లితే మమ్మువారు రానీయరు. వెళ్లే తలంపు కాడా మాకు లేదు. నీ పాదమూలమే మాకు శరణ్యం. దాసీజనులుగా పాటించి మమ్ము గైకొమ్మని ప్రార్ధిస్తారు.
పరమాత్మ అనుగ్రహానికి తమ సతులు పాత్రత వహించారని తెలిసి అనంతరం వారి పతులైన ఆ విప్రజనులు తమ అవివేకాన్ని గుర్తించి ఎంతో పశ్చాత్తాపపడి ఇలా వాపోతారు.
కట కట మోసపోయితిమి కాంతల పాటియు బుద్ధి లేదు - నే డిట హరిగాన బోనెఱుగ - మేము దురాత్ముల - మేము కల్మషో ద్భటులము - విష్ణు దూరగుల ప్రాజ్ఞత లేల - తపంబు లేల - ప ర్యటనము లేల - శీలములు యాగములున్ మఱియేల కాల్పనే
Page 208