
నడచి వస్తాడు. దూర గమన క్లేశ ఖిన్నులైన గోపకులా కటికి తట్టుకోలేక అన్నం పెట్టించమని కృష్ణుని ప్రాధేయపడతారు. ఆయనవారితో ఆ బ్రాహ్మణులు దేవయజనం చేస్తున్నారు - వారిని వెళ్లి అడగండి - పెడతారని చెబుతాడు. వారు వెళ్లి
హే భూమి దేవాః శృణుత - కృష్ణస్యా దేశకారిణః ప్రాప్తాన్ జానీత - భద్రంవో గోపాన్నో - రామ చోదితాన్
గాశ్చారయంతా వవి దూర ఓదనమ్ రామాచ్యుతౌ యల్లషతో బుభుక్షితౌ తయోర్ద్విజా ఓదన మర్థినో ర్యది శ్రద్ధాళవో యచ్ఛత ధర్మవిత్తమాః
రామకృష్ణులు పంపితే తమ దగ్గరికి వచ్చాము. వారీ అరణ్యంలో ధేనువులను మేపుకొంటూ వచ్చి చాలా ఆకలిగొని ఉన్నారు. మీరు సకల ధర్మములూ తెలిసినవారు. శ్రద్ధాళువులే అయితే మీరు అన్నార్తులయి ఉన్న వారికన్న భిక్ష పెట్టగోరుతున్నామని యాచిస్తారు. కాని వారా మాటలు వినిపించుకోరు. దేశకాల ద్రవ్యమంత్ర తంత్రాదులన్నీ భగవన్మయమని ఆ భగవంతుడు సాక్షాత్తూ ఈ కృష్ణ పరమాత్మేనని తెలుసుకోలేక “మనుష్య దృష్ట్యా దుష్ప్ర జ్ఞామర్యాత్మానోన తేవిదుః” మనుష్యమాత్రుడని భావిస్తారు లేదు పొమ్మని కసరికొడతారు. వారు మరలా వచ్చి మొరపెడితే
“తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వరః వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీమ్ గతిమ్ మామ్ జ్ఞాపయత పత్నీభ్యః ససంకర్షణ మాగతమ్ దాస్యంతి కామ మన్నమ్వః”
ఆయన నవ్వి వారి దగ్గరికి వెళ్లకండి. ఈ సారి వారి భార్యల దగ్గరికి వెళ్ళి అడగండి. మేము వచ్చామని చెప్పారంటే తప్పకుండా వారు మిమ్ముల నాదరిస్తారని చెబుతాడు.
అలాగే నని గోపకులా విప్రభార్యల వద్దకు వెళ్ళి చెప్పేసరికి కృష్ణాగమనవార్త తమ చెవుల కమృతవర్షంలాగా అయి వారు “బిడ్డలు మగలును భ్రాతలునడ్డము
Page 207
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు