#


Index

కర్మయోగులు - దక్షాదులు

గురువు. దాని మాట తత్త్వమసి లాంటి మహావాక్యం. తన్మూలంగా నేనీ స్త్రీ పుంస రూపుణ్ణి కాను. నాకీ బంధు మిత్రాది సంబంధమేదీ లేదు. నేనా పరమాత్మ స్వరూపుణ్ణి అని స్వస్థుడవుతాడుజీవుడు. స్మస్మింస్తిష్ఠ తీతి స్వస్థః స్వేమహిమ్ని ప్రతిష్ఠితః అన్నట్టు తన స్వరూపంలో తానుండటమే స్వస్థత. అలా లేకపోతే అది వ్యభిచారం. దానివల్ల ఆత్మ స్థితి కోలుపోయి అనాత్మ ప్రపంచంలో పడిపోతాడు మానవుడు. అదేగదా పురంజనుడి సంసార యాత్ర. అది ఇప్పుడీ గురూపదేశం వల్ల తొలిగిపోయి పూర్వ వైభవం మరలా అనుభవానికి వచ్చింది.

  ఇంత పెద్ద సంకేతముంది ఈ కథలో. జీవుడి అవిద్యా కామకర్మలూ వాటివల్ల కలిగే అనర్ధమూ దాన్ని పోగొట్టుకొని మరలా పురుషార్ధాన్ని సాధించవలసిన అవశ్యకతా ఎలాంటిదో నిరూపించటానికే ఈ కథా కథనమంతా. ఇంతకూ కామమే కర్మకు మూలం. కామానికి మూలం అవిద్య. అవిద్యఅంటే అజ్ఞానం. అజ్ఞానం వల్లనే తనకేదో స్వర్గాది భోగాలు లభిస్తాయని చెప్పి దానిమీది కామంతో నోరులేని పశువుల నెన్నింటినో వధించటానికి పాలుపడతారు కర్మిష్ఠులు. జ్ఞానం లేకపోవటం వల్లనే ఇలాంటి కామ్యకర్మలలో నిమగ్నులు కావటం. దీనివల్ల ముక్తి లేదు సరిగదా చివరకు నరకపాతం తప్పదు వీరికి. కాబట్టి ఆత్మజ్ఞానం సంపాదించి ఇలాంటి కామ్యకర్మలన్నిటికి స్వస్తి చెప్పమని చెప్పటానికే నారదుడీ పురంజనకథ ఒకటి కల్పించి ప్రాచీన బర్షికి బోధించాడు. దక్షుడిలాగా అతడు మందాధికారి కాడుకాబట్టి కోపతాపాలకు గురిగాక ఆ బోధలోని పరమార్ధాన్ని గ్రహించి బాగుపడతాడు. మొదట మొదట అవివేకంతో పొరబాటు పడి కర్మమయ జీవితం కొనసాగించినా క్రమంగా పెద్దల సాహచర్యంతో వారి బోధలు విని అందులోని ప్రమాదాన్ని గుర్తించి జీవిత కర్తవ్యమేదో దాన్ని పాటిస్తూ పోవాలని దీనికంతటికీ తాత్పర్యార్ధం.

  ప్రాచీన బర్హి వృత్తాంతం కన్నా ఇంకా కొంత సున్నితమైనది విప్రజనుల వృత్తాంతం. పశు వధ పాతకమైనా ఉన్నదందులో. వీరి విషయంలో అలాటి హింసాకార్యాదులు కూడా లేవు. అయితే కామ్యమనేది మాత్రమక్కడా ఇక్కడా సమానమే. స్వర్గ సుఖ కామంతోనే ద్వాపరయుగంలో కొందరు విప్రులు బృందావన సమీపంలో ఆంగిరసమనే పేరు గల సత్రయాగం తలపెట్టి సలుపుతుంటారు. కృష్ణుడు తన తోడి గోపబాలురతో గూడి పసుల కదుపులను వెంట బెట్టుకొని చాలా దూరం

Page 206

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు